కేరళలో పోలీసు స్టేషన్‌లో చికెన్ వండిన పోలీసులు.. వీడియో వైరల్.. వివరణ ఇవ్వాలని ఐజీ ఆదేశం
కేరళ పోలీసులు డ్యూటీలో ఉండగానే టోపియాక, చికెన్ వంట చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీంతో ఆ ఘటనపై వివరణ ఇవ్వాలని సౌత్ రీజియన్ ఐజీ ఆ పోలీసులను ఆదేశించారు.
తిరువనంతపురం: కేరళలోని ఓ పోలీసు స్టేషన్‌లో పోలీసులు చికెన్ కూర వండారు. దానితోపాటు టోపియాక(కర్రి పెండలం) వండారు. కేరళలో టోపియాక, చికెన్ వంటకం చాలా ఫేమస్. ఈ డిష్ వండి ఆకుల్లో సర్వ్ చేసుకుని తిన్నారు. ఈ ఘటనను వీడియో తీశారు. దానికి ఒక సాంగ్ జోడించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో తెగ వైరల్ అయింది. చాలా మంది నెటిజన్లు పాజిటివ్‌గా కామెంట్ చేశారు. వీడియోను ఆదరించారు. పోలీసులనూ పొగిడారు. కానీ, ఈ వీడియో పై అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు సమస్యలో చిక్కుకున్నారు.
పోలీసు డ్యూటీలో ఉండగానే.. పోలీసు స్టేషన్‌లో వంటకం చేయడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఈ వైరల్ వీడియోపై వివరణ ఇవ్వాలని సౌత్ రీజియన్ ఐజీ ఆదేశించారు. డ్యూటీలో ఉండగా ఇలా వంట వండటాన్ని ఆరా తీస్తూ ఎక్స్‌ప్లెనేషన్ డిమాండ్ చేశారు. ఈ ఘటన కేరళలో పథానంతిట్టలో ఎలవుంతిట్ట పోలీసు స్టేషన్‌లో జరిగింది.