Asianet News TeluguAsianet News Telugu

Crime: బిడ్డలపై అత్యాచారానికి లవర్స్‌కు అనుమతించిన కేరళ మహిళ.. షాకింగ్ స్టోరీ ఇదే

బిడ్డలపై లవర్‌లతో అత్యాచారానికి సహకరించిన కర్కశ తల్లికి కోర్టు 40 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా కదిలించింది. ఈ కేసుకు సంబంధించిన షాకింగ్ విషయాలు ఇలా ఉన్నాయి. అసలు ఘటన ఎలా బయటకు వచ్చిందంటే?
 

Kerala Mother let her lovers sexually assault her daughters, details of the shocking case here kms
Author
First Published Nov 28, 2023, 10:57 PM IST

Shocking Story: ఈ కేసు అందరినీ బాధించింది. ఇలాంటి తల్లి కూడా ఉంటుందా? అని తీవ్ర వేదనను కలిగింది. తల్లి అనే మాటకు కళంకంగా ఆ కేరళ మహిళ మారింది. భర్తను వదిలి ఇద్దరి లవర్స్‌తో ఉన్న ఆమె.. ఇద్దరి బిడ్డలపై వారు రేప్ చేయడానికి సహకరించింది. ఈ ఘటనపై కేసు నమోదైంది. ఓ స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తిరువనంతపురానికి చెందిన ఆ మహిళకు 40 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. రూ. 20 వేల జరిమానా వేసింది. ఈ షాకింగ్ స్టోరీకి సంబంధించిన కీలక విషయాలు ఇలా ఉన్నాయి.

నేరం ఎలా జరిగింది?

ఈ నేరం 2018 మార్చి నుంచి 2019 సెప్టెంబర్ మధ్యలో జరిగింది. ఆ మహిళ మానసిక స్థిమితం లేని భర్తకు దూరంగా ఉంటున్నది. తన ఇద్దరు లవర్స్‌తో కలిసి ఉంటున్నది. అప్పుడు మహిళ ఇద్దరు కూతుళ్ల వయసు 11 ఏళ్లు, 7 ఏళ్లు.

ఫస్ట్ లవర్ శిశుపాలన్ ఆ వివాహితతో కలిసి ఉన్నప్పుడు ఒక్కటో తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలికపై దారుణంగా దాడి చేశాడు. తనపై జరిగిన లైంగిక దాడి గురించి ఆ బాలిక తల్లికి చెప్పింది. కానీ, ఆమె బిడ్డను కాపాడుకునే ప్రయత్నం చేయలేదు. పైగా లవర్‌ వైపు నిలిచి బిడ్డకు మరింత నరకం చూపిందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్ఎష్ విజయ్ మోహన్ తెలిపారు.

తన బిడ్డను చాలా సార్లు ఆ లవర్‌ వద్దకు తీసుకువచ్చింది. ఆ నిందితుడు బాలికపై చాలా సార్లు లైంగిక దాడి చేశాడు. తల్లి సమక్షంలోనే ఆమెను లైంగికంగా వేధించాడు.

Also Read: Barrelakka: కొల్లాపూర్‌లో బర్రెలక్క పోటీతో ఎవరికి నష్టం? ఎవరికి మేలు?

11 ఏళ్ల తన అక్క ఇంటికి వచ్చినప్పుడు బాధిత ఏడేళ్ల బాలిక తనపై జరిగిన దాడి గురించి చెప్పింది. శిశుపాలన్ అంతటితో ఆగలేదు. 11 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు దిగాడు. తమపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆ పిల్లలు ఎవరికీ చెప్పుకోలేదు. నిందితుడు బెదిరించడంతో వారిద్దరూ బిక్కుబిక్కుమంటూ మౌనంగానే మిగిలిపోయారు.

కానీ, ఓ రోజు ధైర్యం చేసి 11 ఏళ్ల బాలిక తన చెల్లిని తీసుకుని వారి చెర నుంచి తప్పించుకుని అమ్మమ్మ వద్దకు వెళ్లింది. అమ్మమ్మకు వారిద్దరూ ఏడుస్తూ వారిపై జరిగిన ఘోరాలను వివరించారు. ఆమె వెంటనే ఈ విషయాన్ని బయటకు చెప్పింది. వారిని ఓ పిల్లల ఆశ్రమంలో చేర్పించింది. అక్కడ కౌన్సెలింగ్ జరుగుతుండగా ఆ పిల్లలూ తాము ఎదుర్కొన్న నరకాన్ని బయటపెట్టారు.

శిశుపాలన్ ఆ బాలికను రేప్ చేశాడని, ఆమె ప్రైవేట్ భాగాలు గాయపడ్డాయని కోర్టు దృష్టికి వెళ్లింది. 2018, 2019 కాలంలో తల్లి సమక్షంలోనే బాలిపై పలుమార్లు అత్యాచారం జరిగినట్టు కోర్టు గుర్తించింది. మరో లవర్ ఈ ఇద్దరిలో ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై వేరే కేసు నమోదైంది.

Also Read: Explain: డీప్ ఫేక్ అంటే ఏమిటీ? దాన్ని ఎలా గుర్తుపట్టాలి?

కోర్టు ఏం చెప్పింది?

కోర్టు 22 మంది సాక్షులను పరిశీలించింది. 33 డాక్యుమెంట్లను సమర్పించారు. ఈ కేసులో పోక్సో చట్టం కింద నిందిత మహిళకు 40 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. రూ. 20 వేల జరిమానా విధించింది. ఈ కేసులో విచారణ ఆ మహిళపైనే జరిగింది. ప్రధాన నిందితుడైన శిశుపాల్ విచారణ జరుగుతున్న కాలంలో ఆత్మహత్య చేసుకుని మరణించాడని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్ఎస్ విజయ్ మోహన్ తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios