Kottayam : తాజాగా ఒక షాకింగ్ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఒక వ్యక్తి త‌న ముగ్గురు మైన‌ర్ కూతుళ్ల గొంతు కోసి తాను ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘ‌ట‌న కేర‌ళ‌లో చోటుచేసుకుంది. కొట్టాయం జిల్లా పాల సమీపంలోని రామాపురంలో జోమోన్ అనే వ్యక్తి తన ముగ్గురు మైనర్ కూతుళ్ల గొంతు కోసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Shocking incident: తాజాగా ఒక షాకింగ్ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఒక వ్యక్తి త‌న ముగ్గురు మైన‌ర్ కూతుళ్ల గొంతు కోసి తాను ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘ‌ట‌న కేర‌ళ‌లో చోటుచేసుకుంది. కొట్టాయం జిల్లా పాల సమీపంలోని రామాపురంలో జోమోన్ అనే వ్యక్తి తన ముగ్గురు మైనర్ కూతుళ్ల గొంతు కోసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

వివ‌రాల్లోకెళ్తే.. కొట్టాయం జిల్లా పాల సమీపంలోని రామాపురంలో ముగ్గురు మైనర్ కుమార్తెల గొంతు కోసి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. జోమోన్ (40) సోమవారం తన ఇంట్లో ఉరి వేసుకుని కనిపించాడు. అలాగే, త‌న కూతుళ్లు ర‌క్త‌పుమ‌డుగులో ప‌డి ఉన్నారు. అతని కుమార్తెలు అనన్య (13), అమేయ (10), అనామిక (7) కొట్టాయం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన అర్ధరాత్రి 12.30 గంటలకు జరిగినట్లు సమాచారం.

అయితే, ముగ్గురు కూతుళ్లు ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. కానీ చిన్న కూతురు ఆరోగ్య పరిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. మిగిలిన ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉంది. మృతుడు జోమోన్ ను అతని భార్య గ‌త‌కొంత కాలం క్రితం విడిచిపెట్టింది. అప్ప‌టి నుంచి జోమోన్ తన ముగ్గురు కుమార్తెలతో గత ఏడాదిన్నరగా నివసిస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే ఈ దారుణానికి పాల్ప‌డ్డాడు. త‌న‌ కుమార్తెలను హత్య చేయ‌డం, తానూ ఆత్మహత్య చేసుకోవ‌డానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంద‌ని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు న‌మోదుచేసుకున్నామ‌నీ, ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న‌ద‌ని పోలీసులు పేర్కొన్నారు.