కొట్టాయం: సామాజిక మాధ్యమాల్లో మహిళలతో పరిచయం పెంచుకొని వారిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

కేరళ రాష్ట్రంలోని ఎట్టిమనూర్ సమీపంలోని ఆరిపరబుకు చెందిన  ప్రదీశ్‌కుమార్‌ పెళ్లైన మహిళలతో సామాజిక మాధ్యమాల్లో పరిచయం పెంచుకొనేవాడు.  వివాహిత మహిళల ఫోన్ నెంబర్లను తీసుకొని కుటుంబసభ్యులను తెలుసుకొనేవాడు..

ఆ తర్వాత అమ్మాయిల మాదిరిగా నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలను తెరిచేవాడు. తాను అంతకుముందే మాట్లాడిన వివాహిత భర్తలతో అమ్మాయిల మాదిరిగా చాటింగ్ చేసేవాడు.  ఈ చాటింగ్ స్క్రీన్ షాట్లను తీసి వాళ్ల భార్యలకు పంపేవాడు.  ఈ స్క్రీన్ షాట్లను చూసిన వివాహితలు భర్తలతో గొడవ పెట్టుకొనేవారు. దీంతో భార్య, భర్తల మధ్య దూరం పెరిగేది.

భర్తలకు దూరంగా ఉన్న భార్యలు దూరంగా ఉంటున్నారని గుర్తించి వారితో సన్నిహితంగా చాటింగ్ చేసేవారు. వాటి ఫోటోలను అసభ్యంగా మార్చేవారు. వీటిని ఆసరాగా చేసుకొని  నిందితుడు బాధితులను లైంగిక దాడి చేసేవాడు.  ఈ  రకంగా సుమారు 50 మంది వివాహితలను ఈ నిందితుడు లోబర్చుకొన్నాడు. నిందితుడి ల్యాప్‌టాప్ నుండి  అసభ్యకరంగా  మార్చిన ఫోటోలను స్వాధీనం చేసుకొన్నారు.