ఆయన ఒక ఐఏఎస్ అధికారి. అత్యున్నత హోదాలో ఉన్న ఆయన ఓ మహిళా జర్నలిస్ట్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఓ ఐఏఎస్ అధికారిగా ఆయనతో ఓ పని పడటంతో.. మహిళా జర్నలిస్ట్ ఆయనకు వాట్సాప్ లో మెసేజ్ చేసింది. కాగా... దానికి రిప్లేగా ఆయన అసభ్యకరమైన స్టిక్కర్స్ పంపడం గమనార్హం. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకోగా... ఆయన ఐఏఎస్ అధికారి ప్రశాంత్ నాయర్ కావడం గమనార్హం.

కాగా... ఆయన మహిళా జర్నలిస్ట్ పట్ల ప్రవర్తించిన తీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి. దీనిపై కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టులు ఆందోళన చేపడుతున్నారు.

ప్రశాంత్ ప్రస్తుతం కేరళ స్టేట్ ఇన్లాండ్ నావిగేషన్ కార్పొరేషన్ (కెఎస్ఐఎన్సి) యొక్క మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. కాగా.. అది ఇటీవల ఓ యూఎస్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. కాగా.. ఆ విషయం కాస్త రాజకీయంగా వివాదం రేపింది. దీంతో.. ఈ విషయంపై మహిళా జర్నలిస్ట్ ఐఏఎస్ అధికారి ప్రశాంత్ ని సంప్రదించింది. వాట్సాప్ లో ఆ విషయమై చర్చించేందుకు ఆమె మెసేజ్ చేశారు. 

ఆమె మెసేజ్ కి సమాధానంగా ప్రశాంత్ ఆమెకు రెండు స్టిక్కర్లను పంపాడు. అవి చాలా అసభ్యరీతిలో ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఆ వాట్సాప్ ఛాటింగ్ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో  ఐఎఎస్ అధికారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్ట్ సంఘం..ముఖ్యమంత్రి పినరయి విజయన్, ముఖ్య కార్యదర్శి విశ్వస్ మెహతాకు లేఖ రాశారు.

కేవలం సదరు జర్నలిస్ట్ పవిత్ర.. తనను తాను పరిచయం చేసుకొని.. ఓ న్యూస్ విషయంలో తాను మాట్లాడాలని అనుకుంటున్నానని.. ఇది మీతో మాట్లాడటానికి సరైన సమయమేనా అని అడిగింది. దానికి పరమ చెత్తగా ఆయన రిప్లై ఇవ్వడం గమనార్హం.

సదరు జర్నలిస్ట్, ఐఏఎస్ అధికారి మధ్య జరిగిన సంభాషణను ఈ ఫోటోలను పైన ఫోటోలో చూడొచ్చు. మరి ఈ వివాదంపై సదరు ఐఏఎస్ అధికారి ఎలా స్పందిస్తాడో చూడాల్సి ఉంది.