Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణకు చెందిన ఐపీఎస్ అధికారిపై కేరళ సీఎం సస్పెన్షన్ వేటు.. కారణమిదే..!!

కేరళ (kerala)కేడర్ ఐపీఎస్ లక్ష్మణ్ నాయక్‌ను (lakshman naik ips) సీఎం పినరయి విజయన్‌ (pinarayi vijayan) సస్పెండ్ చేశారు . మోన్సన్ మవున్‌కల్‌తో లక్ష్మణ్‌కు సన్నిహిత సంబంధాలు వున్నాయని నిర్ధారణ కావడంతోనే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు

kerala government suspended ips lakshman naik
Author
Thiruvananthapuram, First Published Nov 10, 2021, 7:09 PM IST

కేరళ (kerala)కేడర్ ఐపీఎస్ లక్ష్మణ్ నాయక్‌ను (lakshman naik ips) సీఎం పినరయి విజయన్‌ (pinarayi vijayan) సస్పెండ్ చేశారు . మోన్సన్ మవున్‌కల్‌తో లక్ష్మణ్‌కు సన్నిహిత సంబంధాలు వున్నాయని నిర్ధారణ కావడంతోనే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. లక్ష్మణ్ నాయక్ పై గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. దీనిపై సమగ్ర విచారణ జరిపిన ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 1997 బ్యాచ్ కు చెందిన లక్ష్మణ్ నాయక్ తెలంగాణలో మంత్రిగా కూడా అవుతారని గతంలో ప్రచారం జరిగింది. ఆయనను కేసీఆర్ మంత్రిని చేస్తారన్న ప్రచారం రావడంతో ఆయన పేరు తెలంగాణ వ్యాప్తంగా మారుమోగింది. లక్ష్మణ్ నాయక్‌ స్వస్థలం తెలంగాణ (telangana) రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా (khammam). ప్రస్తుతం ఆయన ఐజీ కేడర్‌లో సీఎంకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌‌గా వ్యవహరిస్తున్నారు. ఇటలీలో స్థిరపడ్డ మలయాళీ మహిళతో కలిసి లక్ష్మణ్ నాయక్ పురాతన వస్తువుల వ్యాపారం చేసినట్లు సీఎంకు సమర్పించిన నివేదికలో దర్యాప్తు అధికారులు వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios