తిరువనంతపురం: గర్భంతో ఉన్న ఏనుగు మరణించడానికి పేలుడు పదార్ధాలు నింపి ఉన్న కొబ్బరికాయ తినడమే కారణమని అధికారులు తేల్చారు. ఏనుగు మృతికి కారణమైన ఓ వ్యక్తిని శుక్రవారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరి కోసం గాలింపు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.

కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాలోని వెల్లియార్ నదిలో గర్భంతో ఉన్న ఏనుగు గత నెల 27వ తేదీన మరణించింది. ఈ ఏనుగు మరణించడానికి పేలుడు పదార్ధాలు నింపిన పైనాపిల్ తినడమే కారణమని తొలుత ప్రచారం సాగింది.  అయితే పైనాపిల్ కాదు... కొబ్బరికాయ తినడం వల్లే ఏనుగు మరణించిందని అధికారులు చెప్పారు.

ఏనుగు పోస్టుమార్టం నివేదిక మాత్రం సుమారు 14 రోజుల పాటు నీళ్లు, ఎలాంటి ఆహారం తీసుకోకపోవడంతో ఏనుగు మరణించిందని కూడ రెండు రోజుల క్రితం వైద్యులు ప్రకటించారు.

మరణించిన ఏనుగు దవడ భాగం తీవ్ర గాయాలతో ఉందని వైద్యులు ప్రకటించారు.శుక్రవారం నాడు రబ్బరు సేకరించే వృత్తిలో ఉన్న 38 ఏళ్ల విల్సన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

also read:కేరళలో ఏనుగు మృతి: ఒకరి అరెస్ట్, మరికొందరి కోసం పోలీసుల వేట

అడవి పందులు ఇతరత్రాల జంతువుల నుండి పంటలను రక్షించుకొనేందుకు పేలుడు పదార్ధాలు నింపిన పండ్లను పంట పొలాల వద్ద ఏర్పాటు చేస్తారు.అయితే ఏనుగుకు ఉద్దేశ్యపూర్వకంగా కొబ్బరికాయ తిందా లేదా  ఉద్దేశ్యపూర్వకంగానే ఎవరైనా తినిపించారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

పేలుడు పదార్ధాలు తయారు చేసే ప్రాంతానికి రబ్బరు సేకరించే  వృత్తిలో ఉన్న విల్సన్ పోలీసులకు చూపాడు. మరో ఇద్దరితో కలిసి పేలుడు పదార్ధాలను  తయారు చేసినట్టుగా ఆయన ఒప్పుకొన్నాడని పోలీసులు చెప్పారు.మరో ఇద్దరి నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.