Asianet News TeluguAsianet News Telugu

12రోజుల బిడ్డకు పాలిచ్చి, ప్రాణం కాపాడిన మహిళా పోలీస్.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు..

భార్యతో గొడవపడి 12రోజుల పసికందును తీసుకుని పారిపోయాడు ఓ భర్త. ఆ చిన్నారి తల్లిపాలు లేక ప్రాణాపాయస్థితికి చేరుకుంది. తల్లి ఫిర్యాదుతో తీవ్రంగా గాలించి తండ్రిని, చిన్నారిని పట్టుకున్నారు పోలీసులు. 

Kerala Cop Who BreastFed Infant Praises pouring on her
Author
First Published Nov 3, 2022, 8:03 AM IST

కేరళ : టీచర్ కావాలన్నది ఆమె లక్ష్యం. అందుకే పీజీ తర్వాత బీఈడీ చేసింది. 24 ఏళ్ల వయసులో అనుకోకుండా పోలీస్ అధికారిగా ఎంపికయింది. నాలుగేళ్ల క్రితం విధుల్లో చేరింది. ఆమె  ఎం.ఆర్.రమ్య. ఆమె మీద కేరళ రాష్ట్రంలో ఇప్పుడు ప్రశంసల జల్లు కురుస్తోంది. పోలీసుల ప్రతిష్ట పెంచిన అధికారిగా, అసలైన మాతృమూర్తిగా ఆమెను అభినందిస్తూ కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామచంద్ర ఓ లేఖ కూడా పంపారు. డీజీపీ అనిల్ కాంత్  కుటుంబ సమేతంగా  రమ్యను పోలీస్ హెడ్ క్వాటర్స్ కు ఆహ్వానించి, ప్రశంసా పత్రం అందజేశారు. 

ఇంతకీ ఆమె ఏం చేశారంటే.. ఓ కేసులో తల్లికి దూరమైన 12 రోజుల చిన్నారికి మాతృమూర్తిగా పాలిచ్చి, ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు. తనతో గొడవపడి, పొత్తిళ్లలోని 12 రోజుల పసిబిడ్డతో భర్త ఎటో వెళ్ళిపోయాడని అక్టోబర్ 29న ఓ మహిళ చేవాయుర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ ప్రారంభించిన రమ్య బృందం బెంగళూరు సమీపంలోని సుల్తాన్ బతేరీ వద్ద వాహన తనిఖీలు సందర్భంగా బిడ్డతో పాటు ఆమె భర్తను పట్టుకున్నారు. అప్పటికే తల్లిపాలు లేకపోవడంతో, డస్సిపోయిన ఆ చిన్నారిని పరీక్షించిన అక్కడి వైద్యులు చక్కెర నిల్వలు తగ్గిపోయాయని చెప్పారు. 

భార్య మైనర్ గా ఉన్నప్పుడు అత్యాచారం.. భర్తకు 20యేళ్ల జైలుశిక్ష.. కానీ ట్విస్టేంటంటే...

అప్పటికి రమ్యకు పాలుతాగే చిన్నారి ఉంది. ఆ సమయంలో తన ఇద్దరు పిల్లలు గుర్తుకు వచ్చారు ఆమెకి. మరో ఆలోచన లేకుండా ఆ బిడ్డకు తానే పాలిచ్చి మాతృహృదయం చాటుకున్నారు. ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న భర్త కూడా తన చర్యను సమర్ధించి హర్షం వ్యక్తం చేశారని ఆమె తెలిపారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. "మేము బిడ్డను వెతుక్కుంటూ వెళుతున్నప్పుడు, నామనసులో ఆ తల్లి పడే వేదన.. బిడ్డ బాధల గురించే ఆలోచిస్తున్నాను. ఇద్దరినీ కలపాలని ఎంతో గట్టిగా కోరుకున్నాను. మధ్య మధ్యలో నా భర్తకు ఫోన్ చేస్తూ అతని నుంచి మోరల్ సపోర్ట్ తీసుకుంటున్నాను. మీరు తప్పకుండా కనిపెడతారని నా భర్త నాకు ధైర్యం ఇచ్చాడు. అదే నిజం అయ్యింది’ అని చెప్పుకొచ్చారామె. 

చిన్నారితో పాటు తండ్రి తాను పనిచేసే బెంగళూరు వెళ్లి ఉండొచ్చనే నిర్ధారణతో వాయనాడ్‌ సరిహద్దులోని పోలీస్‌స్టేషన్లు అప్రమత్తమై రాష్ట్ర సరిహద్దుల్లో వాహనాల తనిఖీ చేయగా సుల్తాన్ బతేరి పోలీసులకు పాప, తండ్రి దొరికారు. 

Follow Us:
Download App:
  • android
  • ios