కేరళలోని కోజికోడ్‌లో జరిగిన విమాన ప్రమాదం.. ప్రస్తుతం కరోనా అలజడికి కారణమవుతోంది. ప్రమాదంలో సహాయక చర్యలు అందించిన అధికారులు ఒక్కొక్కరిగా కోవిడ్ బారినపడుతుండటం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

సహాయ చర్యల్లో పాల్గొన్న అధికారుల్లో 22 మందికి పాజిటివ్‌గా తేలింది. ఈ జాబితాలో జిల్లా కలెక్టర్ తో పాటు పలువురు ఉన్నతాధికారులు, పోలీసులు సైతం ఉన్నారు. కాగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ సైతం ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు.

Also Read:కేరళ విమాన ప్రమాదం.. తొలి ఐదు నిమిషాల్లో ఏం జరిగిందంటే..

ఆ సమయంలో సీఎం వెంట జిల్లా కలెక్టర్, అధికారులు ఉన్నారు. వీరికి కరోనా సోకిన విషయం తెలుసుకున్న సీఎం విజయన్‌తో పాటు పలువురు అధికారులు హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు.

ఈ విషయాన్ని సీఎం కార్యాలయం శుక్రవారం వెల్లడించింది. ముఖ్యమంత్రి క్వారంటైన్‌లోకి వెళ్లిపోవడంతో శనివారం స్వాతంత్ర్య దినోత్స వేడుకల సందర్భంగా రాష్ట్ర సహకార, దేవాదాయ శాఖ మంత్రి సురేంద్రన్ జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారని సీఎంవో వెల్లడించింది.

Also Read:కేరళ విమాన ప్రమాదం: కో పైలట్ మృతి.. 15 రోజుల్లో భార్య డెలీవరి, నిజం దాచిన కుటుంబం

కాగా వందే భారత్ మిషన్‌లో భాగంగా ఆగస్టు న 191 మంది ప్రయాణికులతో దుబాయ్ నుంచి భారత్‌కు బయల్దేరిన ఎయిరిండియా విమానం.. కోజికోడ్‌ విమానాశ్రయంలో రన్‌వే పై నుంచి జారిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్, కో పైలట్ సహా 18 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.