కేరళలోని తిరువనంతపురం సెంట్రల్ జైలు నుంచి ఓ ఖైదీ పారిపోయే ప్రయత్నం చేశాడు. జైలు గోడకు సమీపంలోని చెట్టు ఎక్కాడు. కానీ, ఆ విషయం అధికారులకు తెలిసింది. దీంతో కింద సేఫ్టీ నెట్ పరిచి కిందికి రావాల్సిందిగా వారు కోరారు. కానీ, ఆయన ససేమిరా అన్నాడు, 

తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలోని సెంట్రల్‌ జైలులో ఓ ఖైదీ మర్డర్ కేసులో శిక్ష అనుభవిస్తున్నాడు. జైలు నుంచి బయటపడటానికి తీవ్ర ప్రయత్నాలు చేశాడు. తాజాగా, సెంట్రల్ జైలు గొడకు పక్కనే ఉన్న చెట్టు ఎక్కాడు. కానీ, ఆయన ఎక్కిన కొమ్మ విరిగిపోయింది. చెట్టుపై ఉన్న ఖైదీని అధికారులు చూశారు. కిందకు దిగి రావాల్సిందిగా సూచించారు. కానీ, ఆ ఖైదీ ససేమిరా అన్నాడు. ఎంతగా సర్దిచెప్పినా ఖైదీ కిందికి దిగి రాలేదు. దీంతో కొందరు అధికారులే చెట్టుపైకి ఎక్కాలని అనుకున్నారు. కొందరు ఆ ఖైదీ ఎక్కి కూర్చున్న చెట్టు ఎక్కారు. తీరా.. ఆ ఖైదీని పట్టుకోబోయే లోపే మరో కొమ్మకు దూకాడు. దీంతో తాను కూర్చున్న కొమ్మ విరిగిపోయింది. ఆ తర్వాత ఖైదీ చెట్టు పై నుంచి కింద పడ్డాడు. కానీ, అధికారులు అప్పటికే సేఫ్టీ నెట్ ఏర్పాటు చేయడంతో ప్రమాదం తప్పింది. ఈ తతంగమంతా స్తానిక చానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం జరిగింది. 

కొట్టాయంకు చెందిన సుభాష్ అనే వ్యక్తి మర్డర్ కేసులో దోషిగా తేలాడు. 2014 నుంచి జైలులో ఉంటున్నాడు. అయితే, ఇటీవలే ఆయనలో మానసిక సమస్యలు కనిపిస్తున్నాయని గుర్తించి సెంట్రల్ జైలుకు పంపించారు. 

తిరువనంతపురం సెంట్రల్ జైలు నుంచి తప్పించుకోవాలని సుభాష్ అనే ఖైదీ సాయంత్రం గోడకు పక్కనే ఉన్న చెట్టు ఎక్కడాడు. గోడకు దగ్గరలోనే ఆ చెట్టు ఉన్నది. కానీ, ఆ చెట్టు పై నుంచి చివరకు సుభాష్ కింద పడిపోయాడు. అప్పటికే అగ్ని మాపక అధికారులు సేఫ్టీ నెట్ ఏర్పాటు చేశారు.

అనంతరం ఆ ఖైదీని వెంటనే సెంట్రల్ జైలులోని హాస్పిటల్‌కు తరలించారు.

చెట్టు పై ఉన్నప్పుడు ఖైదీ సుభాష్ కిందకు దిగి రావాలని ఎంత కోరినప్పటికీ ఆయన రాలేదు. ముగ్గురు సర్వీస్ అఫీషియల్స్ చెట్టు ఎక్కారు. కానీ, అక్కడ అతనిని పట్టుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు ఖైదీఅ సుభాష్ మరో కొమ్మపైకి వెళ్లాడు. దీంతో ఆ కొమ్మ విరిగిపోయింది. అనంతరం సేఫ్టీ నెట్‌లో కిందపడిపోయాడు. 

జైలు నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడన్న అభియోగాల కింద ఆ ఖైదీపై కేసు పెట్టబోతున్నట్టు జైలు అధికారులు తెలిపారు.