లక్నో: తినేందుకు తిండి లేక  ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు పాల్పడే ముందు  తన చావుకు  తన తండ్రి, సోదరులే కారణమని ఆ యువతి సూసైడ్ లేఖ రాసింది.ఇలాంటి తండ్రి, సోదరులు ఉండకూడదని బాధితురాలు  ఆ లేఖలో పేర్కొంది.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో  మూడు రోజులుగా అన్నం లేక ఓ యువతి  ఆత్మహత్యకు పాల్పడింది.  నెక్ రాము  అనే వ్యక్తికి భార్య, నలుగురు పిల్లలున్నారు. నెక్ రాముకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. చేతిపంపులు రిపేర్ చేస్తూ  నెక్ రాము జీవనం సాగిస్తున్నాడు.

ఇద్దరు కొడుకులు ఓ కూతురికి వివాహమైంది. తల్లిదండ్రులతో పాటు మృతురాలు నివాసం ఉంటుంది.  మద్యానికి బానిసగా మారిన నెక్ రాము  కుటుంబాన్ని పట్టించుకొనేవాడు.  కొద్ది రోజులుగా ఇంట్లో నిత్యావసర సరుకులు అయిపోయాయి. నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు ఆయన ఇంట్లో డబ్బులు ఇవ్వలేదు. అంతేకాదు నిత్యావసర సరుకులను కూడ తీసుకు రాలేదు.

ఈ పరిణామాల నేపథ్యంలో మూడు రోజులుగా  తిండిలేక ఆ యువతి అల్లాడింది.ఈ విషయమై తండ్రితో పాటు తన సోదరులకు సమాచారాన్ని ఇచ్చింది. అయినా వాళ్లు పట్టించుకోలేదు.  మృతురాలి తల్లి మతిస్థిమితం కోల్పోయింది.   దీంతో బాధితురాలు  ఆకలితో తట్టుకోలేక ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

తన చావుకు  తన తండ్రితో పాటు సోదరులు కారణమని బాధితురాలు సూసైడ్ నోటు రాసింది. ఇలాంటి తండ్రి, సోదరులు ఉండకూడదని బాధితురాలు కోరింది. తన ఆత్మహత్యకు కారణమైన తండ్రి, సోదరులకు శిక్ష పడితేనే తన ఆత్మ శాంతిస్తోందని బాధితురాలు ఆ లేఖలో రాసింది.