ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్షనేత రాంవీర్ సింగ్ బిధూరి. కేజ్రీవాల్‌ను తీహార్ జైలుకు పంపేవరకు బీజేపీ కార్యకర్తలు విశ్రమించరని ఆయన పేర్కొన్నారు. 

ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన అధికారిక నివాసం పునరుద్ధరణ కోసం రూ.45 కోట్లు ఖర్చు చేసినట్లు బీజేపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆప్ , బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్షనేత రాంవీర్ సింగ్ బిధూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ జైలుకు వెళ్లక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు.

మంగళవారం సీఎం నివాసం వద్ద ఆయన మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి తన అధికారిక నివాసం సుందరీకరణ కోసం రూ.15 లక్షల వరకు ఖర్చు చేసుకోవచ్చని అన్నారు. కానీ దీనికి బదులుగా కేజ్రీవాల్ రూ.45 కోట్లు ఖర్చు చేశారని రాంవీర్ సింగ్ దుయ్యబట్టారు. కేజ్రీవాల్‌ను తీహార్ జైలుకు పంపేవరకు బీజేపీ కార్యకర్తలు విశ్రమించరని ఆయన పేర్కొన్నారు. కేజ్రీవాల్, ఆప్ అకృత్యాలు ఢిల్లీ ప్రజల ముందు బట్టబయలు అయ్యాయని.. 2025లో ఆయనను గద్దె దింపుతారని బిధూరి జోస్యం చెప్పారు. 

మరోవైపు.. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు కేజ్రీవాల్ మద్ధతు పలికిన సంగతి తెలిసిందే. మా అక్కాచెల్లెళ్ల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, అలాంటి వ్యక్తిని వెంటనే శిక్షించి ఉరి తీయాలని అన్నారు. సీఎం కేజ్రీవాల్ ఇంకా మాట్లాడుతూ.. ‘‘మన దేశంలోని ఏ అమ్మాయితో అయినా తప్పు జరిగితే వెంటనే అరెస్ట్ చేసి ఉరితీయాలి.. కానీ భారత పతాకాన్ని ప్రపంచవేదికలపై ఎగిరివేసిన ఆ అమ్మాయిలు జంతర్‌లో ఎందుకు కూర్చోవాలి. తప్పు చేసిన వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలా? సమస్య ఏమిటి?" అని విమర్శించారు.

Also Read: PM Modi degree: మరో వివాదంలో ఇరుక్కున్న ఢిల్లీ సీఎం.. కేజ్రీవాల్ పై పరువు నష్టం దావా

ఒలంపిక్స్ ఆడాలని కలలు కనే ప్రతి యువతి యువకులకు అండగా నిలుస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. దేశం మొత్తం ఆటగాళ్లకు అండగా నిలుస్తుమని అన్నారు. అమ్మాయిలు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి కష్టపడుతున్నప్పటి నుండి అలాంటి వ్యక్తిని రక్షించడానికి మోడీ ఎందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రశ్న నా మదిలో వస్తోంది. వాళ్లలో ఒకరు రైతులపైకి వాహనం నడిపారని, దానిపై కూడా చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.

మైనర్‌తో సహా ఏడుగురు మహిళా రెజ్లర్లు ఫిర్యాదుల ఆధారంగా రెండు ఎఫ్‌ఐఆర్‌లలో పేరు పెట్టబడిన డబ్ల్యుఎఫ్‌ఐ చీఫ్ బిర్జ్ భూషణ్ సింగ్‌ను కేంద్రం కాపాడుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ ఆరోపించారు. ఏడుగురు మహిళా రెజ్లర్లు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రస్తావిస్తూ.. ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడానికి తాము సుప్రీంకోర్టుకు వెళ్లడం దురదృష్టకరమని కేజ్రీవాల్ అన్నారు. బ్రిజ్ భూషణ్ సింగ్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిట్‌లో ఉన్న ఎఫ్‌ఐఆర్‌ల నమోదును రెజ్లర్లు స్వాగతించారు. అయితే డబ్ల్యుఎఫ్‌ఐ చీఫ్‌ను అన్ని పదవుల నుండి తొలగించి అరెస్టు చేసే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు.