Asianet News TeluguAsianet News Telugu

దేశ రాజకీయాల్లో కేజ్రీవాల్ అతిపెద్ద అబ‌ద్దాలకోరు - బీజేపీ నేత క‌పిల్ మిశ్రా

దేశ రాజకీయాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అతి పెద్ద అబద్దాలకోరు అని బీజేపీ నాయకుడు క‌పిల్ మిశ్రా ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ఓ వీడియో షేర్ చేశారు. 

Kejriwal is the biggest liar in the country's politics - BJP leader Kapil Mishra
Author
First Published Aug 23, 2022, 12:53 PM IST

భార‌త రాజ‌కీయాల్లో అర‌వింద్ కేజ్రీవాల్ అతిపెద్ద అబ‌ద్దాలకోరు అని బీజేపీ నేత క‌పిల్ మిశ్రా అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న ఢిల్లీ సీఎంకు సంబంధించిన పాత వీడియోను షేర్ చేశారు. లిక్కర్ పాలసీ కేసులో బీజేపీ, ఆప్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.

బీజేపీ నాయకురాలు, నటి సోనాలి ఫోగట్ కన్నుమూత.. విచారం వ్యక్తం చేసిన హర్యానా సీఎం

మిశ్ర త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా “ వినండి : ఇది వినండి : చివరిసారి కేజ్రీవాల్ మా ఎమ్మెల్యేలను బీజేపీ పిలుస్తుంద‌ని చెప్పినప్పుడు జ‌రిగిన నిజం. గడ్కరీ జీ, జైట్లీల పేరుతో కేజ్రీవాల్ స్వయంగా ఫోన్ కాల్స్ ఎలా చేశారో చూడండి. కేజ్రీవాల్ భారతదేశ రాజకీయాల్లో అతిపెద్ద అబద్దాలకోరు’’ అని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆయ‌న షేర్ చేసుకున్నారు. ఈ వీడియోలోని మొద‌టి పార్ట్ లో ఆప్ ఎమ్మెల్యేల‌ను బీజేపీ ఆహ్వానిస్తోందని కేజ్రీవాల్ అంటున్నారు. మ‌రో పార్ట్ లో బీజేపీ పిలిచిన‌ట్టు కేజ్రీవాల్ వాటిని ఎలా రూపొందించారో ఆప్ మాజీ కార్య‌క‌ర్త వివ‌రిస్తున్నారు. 

కాగా.. ఇలాంటి విష‌యంలోనే ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా సోమ‌వారం వ్యాఖ్య‌లు చేశారు. ఆప్ ను వ‌దిలేసీ బీజేపీలో చేరాల‌ని త‌న‌కు సమాచారం అందింద‌ని ఆరోప‌ణ‌లు చేశారు. ‘‘ ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ)ని  విచ్చిన్నం చేసి బీజేపీలో చేరండి అని నాకు సందేశం వచ్చింది. మీపై  సీబీఐ, ఈడీలు పెట్టిన అన్ని కేసులను మూసివేసేలా చూస్తాం బీజేపీ తెలిపింది ’’ అని సిసోడియా ట్వీట్ చేశారు. తనపై ఉన్న కేసులన్నీ అబద్ధాలేనని నొక్కి చెప్పిన ఆయన కాషాయపార్టీకి సవాల్ విసిరారు. ‘‘బీజేపీకి నా సమాధానం చెప్తున్న. నేను మహారాణా ప్రతాప్ వారసుడిని. రాజపుత్రుడిని. తల నరుక్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ కుట్రదారులు, అవినీతిపరుల ముందు ఎప్పటికీ మోకరిల్లలేను. నాపై ఉన్న కేసులన్నీ అవాస్తవాలే. మీరు ఏమి చేయాలనుకుంటున్నారో అది చేయండి’’ అని ఆయన హిందీలో ట్వీట్ చేశారు.

ఆప్ ప్రజాదరణను చూసి బీజేపీ భయపడుతున్నందునే తనపై కేసు పెట్టార‌ని సిసోడియా ఆరోపించారు. 2024 సార్వత్రిక ఎన్నికలు కేజ్రీవాల్, ప్రధాని నరేంద్ర మోడీ మధ్య పోటీగా మారబోతున్నాయని, ఆప్ నేతను అడ్డుకునేందుకు బీజేపీ కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. సిసోడియా వ్యాఖ్య‌లు చేసిన అనంత‌రం అర‌వింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు. సీబీఐ-ఈడీ దాడులు తన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలే అని ఆరోపించారు. అయితే ‘ఆపరేషన్ లోటస్’ విఫలమైందని అన్నారు. 

జమ్మూ కాశ్మీర్‌లో 6 గంటల వ్యవధిలో నాలుగు భూకంపాలు..

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అమలులో అక్రమాలకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న 15 మంది వ్యక్తులు, సంస్థలలో మనీష్ సిసోడియా పేరు కూడా ఉంది. కాగా.. ప్ర‌స్తుతం కేజ్రీవాల్, సిసోడియా గుజరాత్‌లో ఉన్నారు. ఈ ఏడాది చివరిలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అక్క‌డ ఆప్ బ‌లంగా త‌యార‌వ్వాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే అక్క‌డ ఇద్ద‌రు ఆప్ నాయ‌కులు అక్క‌డ ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ఘ‌న విజ‌యం సాధించింది. అక్క‌డ పూర్తి మెజారిటీతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేప‌థ్యంలో మ‌రి కొన్ని రాష్ట్రాల‌ను త‌మ ఖాతాలో వేసుకోవాల‌ని ఆప్ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios