Asianet News TeluguAsianet News Telugu

జమ్మూ కాశ్మీర్‌లో 6 గంటల వ్యవధిలో నాలుగు భూకంపాలు..

జ‌మ్మూకాశ్మీర్: రిక్ట‌ర్ స్కేలుపై 2.6 తీవ్రతతో రెండో భూకంపం జమ్మూ ప్రాంతంలోని దోడాకు ఈశాన్యంగా 9.5 కిలోమీటర్ల దూరంలో తెల్లవారుజామున 3.21 గంటలకు సంభవించింది. జమ్మూ ప్రాంతంలోని ఉదంపూర్‌కు తూర్పున 29 కిలోమీటర్ల దూరంలో తెల్లవారుజామున 3.44 గంటలకు 2.8 తీవ్రతతో మూడో భూకంపం సంభవించింది.
 

Four earthquakes hit Jammu and Kashmir in a span of 6 hours.
Author
Hyderabad, First Published Aug 23, 2022, 12:39 PM IST

జమ్మూకాశ్మీర్: జమ్మూకాశ్మీర్ లో వ‌రుస భూకంపాలు ఆందోళ‌న‌ను క‌లిగిస్తున్నాయి. కేవ‌లం ఆరు గంట‌ల వ్య‌వ‌ధిలో నాలుగు భూకంపాలు సంభవించాయ‌ని జ‌మ్మూకాశ్మీర్ అధికారులు తెలిపారు. "మంగళవారం ఎనిమిది గంటల కంటే తక్కువ సమయంలో నాగులు భూకంపాలు సంభ‌వించాయి. అయితే, ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదు" అని అధికారులు తెలిపారు. తెల్లవారుజామున 2.20 గంటలకు సంభవించిన భూకంప కేంద్రం జమ్మూ ప్రాంతంలోని కత్రా ప్రాంతానికి తూర్పున 61 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృత‌మై ఉందని పేర్కొన్నారు. 

10 కిలోమీటర్ల లోతులో ఉత్తర అక్షాంశం 33.07 డిగ్రీలు, తూర్పు రేఖాంశం 75.58 డిగ్రీల వద్ద భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. రెండవ భూకంపం రిక్టర్ స్కేలుపై 2.6 తీవ్రతతో ఈశాన్యంగా 9.5 కి.మీ దోడాజమ్మూ ప్రాంతంలో తెల్లవారుజామున 3.21 గంటలకు సంభ‌వించింద‌ని అధికారులు తెలిపారు. భూకంపం 33.23 డిగ్రీల ఉత్తర అక్షాంశం-75.56 డిగ్రీల తూర్పు రేఖాంశంలో 5 కి.మీ లోతులో న‌మోదైంది.  2.8 తీవ్రతతో మూడో భూకంపం తూర్పున 29 కి.మీ దూరంలో సంభవించింది. ఉధంపూర్ లో ఈ రోజు తెల్లవారుజామున 3.44 గంటలకు జమ్మూ ప్రాంతంలో మ‌రో భూకంపం సంభ‌వించింద‌ని స్థానికులు, అధికారులు తెలిపారు. 10 కిలోమీటర్ల లోతులో ఉత్తర అక్షాంశం 32.89 డిగ్రీలు-తూర్పు రేఖాంశం 75.45 డిగ్రీల వద్ద భూకంపం సంభవించింది.

ఉదంపూర్‌కు ఆగ్నేయంగా 26 కిలోమీటర్ల దూరంలో ఉదయం 8.03 గంటలకు 2.9 తీవ్రతతో నాలుగో భూకంపం సంభవించినట్లు జ‌మ్మూకాశ్మీర్ అధికారులు తెలిపారు. భూకంపం ఉత్తర అక్షాంశం 32.83 డిగ్రీలు-రేఖాంశం 75.40 డిగ్రీల తూర్పున 5 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృత‌మై ఉంది. అయితే, ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు.

 

ఇధిలావుండ‌గా, మూడు రోజుల క్రితం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో కూడా భూకంపం సంభ‌వించింది. లక్నోతో పాటు దాని  పొరుగు జిల్లాల్లో 5.2 తీవ్రతతో భూకంపం వచ్చిందని సంబంధిత అధికారులు తెలిపారు.  శనివారం తెల్లవారుజామున లక్నో మరియు పరిసర జిల్లాల్లో 5.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) ఒక ట్వీట్‌లో తెలిపింది. ప్రాణ నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, ఈ భూకంపం తెల్లవారుజామున 1.12 గంటలకు సంభవించింది. దీని కేంద్రం నేపాల్‌లోని బహ్రైచ్ జిల్లాలో 82 కి.మీ లోతులో ఉంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios