ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న వ్యక్తి బబిత థాడే. ఓ వంట మనిషి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేవలం నెలకు రూ.1500 సంపాదించే ఆమె... ఒక్కసారిగా కోటీశ్వరరాలు అయ్యింది. దీంతో ఆమెకు దేశవ్యాప్తంగా అభినందనలు అందుకుంటోంది. అసలు ఎవరీ బబిత..?

ఆమె పేరు బబిత థాడే. మహారాష్ట్రకు చెందిన ఆమె... ఓ ప్రైవేటు స్కూల్లో పిల్లలకు భోజనం వండి పెట్టేది. 450 మంది చిన్నారులకు వంట చేస్తే... నెలకు ఆమె కేవలం రూ.1500మాత్రమే సంపాదించగలిగేది. కాగా...ఒక్కసారిగా ఆమె కోటి రూపాయలు గెలుచుకుంది. బిగ్ బి అమితాబ్ నిర్వహిస్తున్న మెగా క్విజ్ షో కౌన్ బనేగా కరోడ్ పతిలో  ఆమె రూ.కోటి గెలుచుకుంది.

నిత్యం బతుకుపోరులో పోరాడే ఆమె.. బిగ్ బి ముందు కూర్చొని కష్టమైన.. క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన తీరు ఇప్పుడు వార్తాంశంగా మారింది.

కిచిడీ స్పెషలిస్ట్ గా పేరున్న ఆమె నిత్యం 450 మంది పిల్లలకు కిచిడీ తయారు చేసి పెడుతుంటారు. అలాంటి ఆమె హాట్ సీట్లోకూర్చొని బిగ్ బి అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. చివరకు కోటి రూపాయిల ప్రశ్నకు సమాధానం చెప్పటం.. అది కరెక్ట్ కావటంతో ఇప్పుడామె నయా సంచలనంగా మారారు.

ఆమె రూ.కోటి గెలుచుకున్న ఎపిసోడ్ గత రాత్రి టీవీలో టెలికాస్ట్ అయ్యింది. రూ.కోటి గెలుచుకున్న సందర్భంగా.... ఆ డబ్బులతో ఏం చేస్తారని అమితాబ్ అడిగిన ప్రశ్నకు ఆమె... చెప్పిన సమాధానం కూడా ఆకట్టుకుంటోంది. తనకు ఇప్పటి వరకు మొబైల్ ఫోన్ కూడా లేదని... ముందు ఫోన్ కొనుక్కుంటానని చెప్పడం విశేషం.