జమ్ముకశ్మీర్‌లో ఓ కశ్మీరి పండిట్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. షోపియాన్ జిల్లాలో శనివారం ఈ ఘటన జరిగింది.మృతుడిని పురన్ క్రిషన్ భట్‌గా గుర్తించారు. 

న్యూఢిల్లీ: జమ్ము కశ్మీరులు.. స్థానికేతరులు, కశ్మీరీ పండిట్‌లపై దారుణాలు కొనసాగుతున్నాయి. తాజాగా, ఉగ్రవాదులు మరో కశ్మీరీ పండిట్‌ను పొట్టనబెట్టుకున్నారు. దక్షిణ కశ్మీర్ జిల్లా షోపియాన్‌లో శనివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

మృతుడిని పురన్ క్రిషన్ భట్‌గా అధికారులు గుర్తించారు. చౌదరి గుండ్ ఏరియాలో ఆయన నివాసంలోనే ఈ ఘటన జరిగింది. అదే ఏరియాలోని తమ యాపిల్ తోటకు వెళ్లుతుండగా ఆయన నివాసానికి సమీపం నుంచే వెనుక వైపు నుంచి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కశ్మీరి పండిట్ పురన్ క్రిషన్ భట్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను వెంటనే జిల్లా హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానీ, అప్పటికే పురన్ క్రిషన్ భట్ మరణించినట్టు వైద్యులు తెలిపారు.

Also Read: Target Killing Kashmir: "కాశ్మీరీ పండిట్లకు రక్షణ కల్పించడంలో కేంద్రం విఫ‌లం"

క్రిషన్ భట్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏడో తరగతి చదివే పాప, ఐదో తరగతి చదివే బాలుడు ఉన్నట్టు స్థానికులు తెలిపారు. పురన్ క్రిషన్ భట్ ఇంటి నుంచి కనీసం బయటకు కూడా వెళ్లేవాడు కాదని చెప్పారు. ఎక్కువ ఇంటిపట్టునే ఉండేవారని వివరించారు. తాము చాలా భయాందోళనలకు లోనవుతున్నామని తెలిపారు.

Scroll to load tweet…

ఈ ఘటనను పోలీసులు ధ్రువీకరించారు. కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు. టెర్రరిస్టులు ఓ పౌరుడిపై కాల్పులు జరిపారని, షోపియాన్ జిల్లా చౌదరి గుండ్ ఏరియాలోని వారి తోటకు వెళుతుండగా ఈ కాల్పులు జరిపారని పేర్కొన్నారు. ఆయనను వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారని, కానీ, గాయాలతో మరణించాడని తెలిపారు. ఆ ఏరియాలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని, ఈ ఆపరేషన్ కొనసాగుతున్నదని వివరించారు.