Asianet News TeluguAsianet News Telugu

లోయ‌లో కాశ్మీర్ పండిట్లు అదృశ్యమవుతున్నారు.. కొన్ని రోజుల‌కు మేము కూడా కనిపించం - మెహబూబా ముఫ్తీ

జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లోయలో కాశ్మీర్ పండిట్లు కనిపించకుండా పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఇలాగే కొనసాగితే తాము కూడా కనమరుగు అవుతామని చెప్పారు. 

Kashmir pundits disappear in valley .. We will not be seen for a few days - Mehbooba Mufti
Author
Jammu and Kashmir, First Published May 25, 2022, 3:38 PM IST

ఇత‌ర రాష్ట్రాల ప్ర‌జ‌లు కశ్మీరీల కోసం వెత‌కాల్సిన స‌మ‌యం ఆసన్నమైందని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. ‘‘ మేము చిన్న వ‌య‌స్సులో ఉన్న‌ప్పుడు ఈ ప్రాంతంలో కాశ్మీరీ పండిట్లు ఉన్నారు. కానీ ఈ రోజు నా పిల్లలు కాశ్మీరీ పండిట్లు అంటే ఎవ‌రు ? వారు ఎలా క‌నిపిస్తారు ? అని న‌న్నుఅడుగుతున్నారు. ఎందుకంటే వారు అదృశ్యమవుతున్నారు. వారి సంఖ్య తగ్గింది. అలాగే మేము కూడా దృఢంగా నిలబడలేకపోతే.. మా ఉనికిని కోల్పోయే అవ‌కాశం ఉంది ’’ అని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  

సీమా నువు గ్రేట్.. ఒంటి కాలుతో గెంతుతూ స్కూల్ కు వెళ్తున్న ప‌దేళ్ల బాలిక‌.. ఢిల్లీ సీఎం ప్ర‌శంస‌లు

జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై తీవ్ర విమర్శలు చేసిన మాజీ ముఖ్యమంత్రి.. నేడు రైతుల నుండి భూములను లాక్కుంటున్నారని, ఉద్యోగాలు లాక్కుంటున్నారని ఆరోపించారు. రాళ్లు రువ్వకపోయినా, షట్ డౌన్ పాటించకపోయినా ఇక్కడ 10 లక్షల మంది సైనికులు ఉన్నారని ఆమె చెప్పారు.

ఉగ్రవాద కేసులో దోషిగా తేలిన యాసిన్ మాలిక్ విష‌యంలో ఆమె మాట్లాడుతూ.. తన తండ్రి కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు, తుపాకీని విడిచిపెట్టాల‌ని వేర్పాటువాద నాయకుడిని కోరానని, కానీ అతను తిరస్కరించాడని అన్నారు. ‘‘ యాసిన్ మాలిక్ జైలులో ఉన్నాడు. ముఫ్తీ సయీద్ హోం మంత్రిగా ఉన్నాడు. తుపాకీని ఆపమని మాలిక్ కు సందేశం పంపాడు.  నేను హోంమంత్రిని, విపి సింగ్ నా స్నేహితుడు, కాశ్మీరీల పట్ల సానుభూతి ఉంది. ఆజాదీ తప్ప మీకు ఏం కావాలన్నా ముఫ్తీ ఇస్తారు. ’’ అని ఆమె అన్నారు. 

‘‘ ఆయన (సయీద్) ఇంకా ఏమి చెప్పగలడు ? కానీ అతడు (యాసీన్ మాలిక్) తుపాకీని కొనసాగించాలని, మేము ఎలాంటి చర్చలూ కోరుకోవడం లేదని తిరస్కరించాడు. వాజ్పేయి హయాంలో ముఫ్తీ తిరిగి చర్చలు జరిపారు ’’ అని ఆమె తెలిపారు.  

రైతు భార్యకు దొరికిన డైమండ్... విలువ రూ.10లక్షలు..!

ప్రతిచోటా గుజరాత్ మోడల్ ను రుద్దడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని మెహబూబా ముఫ్తీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం యువతకు ఇవ్వడానికి ఏమీ లేదని, అందుకే మతతత్వ రాజకీయాలకు పాల్పడుతోందని ఆమె తీవ్రంగా ఆరోపించారు. ‘హిట్లర్’ తరహాలో ముస్లింలకు వ్యతిరేకంగా ఏమైనా ఉంటే కేంద్ర ప్రభుత్వం వారికి చెప్పాలని ఆమె అన్నారు.

ఇటీవ‌ల మదర్సాపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ‌శ‌ర్మ‌ చేసిన వ్యాఖ్యల నేప‌థ్యంలో ఆమె బీజేపీ తీవ్రంగా మండిప‌డ్డారు. “ ఒక పోటీ జరుగుతోంది.. గుజరాత్ మోడల్‌ను అమలు చేయాలనుకుంటున్నారా? ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మోడల్‌ను అమలు చేయాలనుకుంటున్నారా?  లేక పోలరైజేషన్ రాజకీయాల్లో అసోం సీఎం రెండడుగులు ముందుకు సాగాలనుకుంటున్నారా?. ఈ దేశపు మూలాలను కదిలించేలా మాట్లాడుతున్నారు.  రాజ్యాంగం ఇప్పుడున ప్ర‌జ‌ల నుంచి వేరు చేయబడుతోంది” అని ముఫ్తీ తెలిపారు. 

దేశాన్ని గుజరాత్, ఉత్తరప్రదేశ్, అసోం, మధ్యప్రదేశ్ మోడల్‌లుగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  “దేశాన్ని గుజరాత్ మోడల్, ఉత్తరప్రదేశ్ మోడల్, అసోం మోడల్, మధ్యప్రదేశ్ మోడల్‌గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముస్లింలను ఎవరు ఎక్కువగా ఇబ్బంది పెట్టాలనే విషయంలో ముఖ్యమంత్రులు ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారు. కాబట్టి, దేవాలయాలు మసీదుల సమస్యలను లేవనెత్తారు” అని ముఫ్తీ ఇటీవ‌ల వ్యాఖ్యానించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios