2 ఏళ్లలో రికార్డు: కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను సందర్శించిన 13 కోట్ల మంది భక్తులు

పార్లమెంట్ వద్ద భద్రతా వ్యవస్థ అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తాయి.  పార్లమెంట్ వద్ద రోడ్ బ్లాకర్స్ తో పాటు  పవర్ ఫెన్సింగ్ కూడ ఉంది.  అంతేకాదు జాయింట్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడ ఏర్పాటు చేశారు.

Kashi Vishwanath Dham Witnesses Record 13 Crore Devotees In 2 Years lns

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాశీ విశ్వనాథ్ కారిడార్ ను  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండేళ్ల క్రితం  ప్రారంభించారు.  అప్పటి నుండి  కాశీకి భక్తుల తాకిడి పెరిగింది. 

2021 డిసెంబర్  13న  కాశీ విశ్వనాథ్ కారిడార్ ను  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. 2019లో  కాశీని 69 లక్షల మంది మాత్రమే సందర్శించారు.  ఈ కారిడార్ ఏర్పాటుతో  ఒక్క పర్యాటక రంగంలోనే  34 శాతం ఉపాధి అవకాశాలు సృష్టించారు. పర్యాటక రంగంపై ఆధారపడిన వారి ఆదాయాలు  65  శాతం పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి.

 

ఆలయ విస్తీర్ణం 3000 చదరపు అడుగుల నుండి 5 లక్షల చదరపు అడుగులకు పెరిగింది.  ఈ ప్రాంతంలోకి  40కి పైగా పురాతన ఆలయాలను పునరుద్దరించారు.

కాశీ విశ్వనాథ్ కారిడార్ ను ప్రారంభించి రెండేళ్లు పూర్తైన సందర్భంగా సంబరాలు నిర్వహిస్తున్నారు. రెండేళ్లలో  కాశీ విశ్వనాథ్ కారిడార్ ను సందర్శించిన భక్తుల్లో  16 వేల మంది విదేశీ భక్తులు కూడ ఉన్నారు.రెండేళ్ల నుండి ఈ ప్రాంతానికి భక్తుల తాకిడి పెరిగిందని కాశీ విశ్వనాథ్ కారిడార్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి సునీల్ వర్మ చెప్పారు. 2022తో పోల్చితే  2023కి సంబంధించిన బుకింగ్ లు రెట్టింపయ్యాయని సీఈఓ తెలిపారు. దేశీయ, విదేశీ భక్తుల సంఖ్య కూడ పెరిగిందని  గణాంకాలు చెబుతున్నాయని సీఈఓ వివరించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios