కరుణానిధి సతీమణి దయాళు అమ్మాళ్‌కు తీవ్ర అస్వస్థత.. అపోలోకు తరలింపు

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 29, Aug 2018, 12:56 PM IST
karunanidhi wife dayalu ammal hospitalised
Highlights

దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి సతీమణి దయాళు అమ్మాళ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి 9 గంటల సమయంలో దయాళు అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారు

దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి సతీమణి దయాళు అమ్మాళ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి 9 గంటల సమయంలో దయాళు అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారు.

ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు. డీఎంకే చీఫ్‌గా స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికైన రోజే ఆమె అస్వస్థతకు గురికావడం గమనార్హం. దయాళు అమ్మాళ్ కరుణానిధికి రెండవ భార్య, వీరికి ఇద్దరు కుమారులు అళగిరి, స్టాలిన్ కుమార్తె సెల్వీ ఉన్నారు.

ఇది కూడా చదవండి:

కరుణానిధి చనిపోయిన విషయం.. ఆయన భార్యకు తెలీదా..?
 

TODAY'S POLL

బిత్తిరి సత్తి శ్రీ ముఖిపై అతిగా కామెంట్ చేశాడా?

loader