తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో డీఎంకే శ్రేణుల్లో ఆందోళన పెరిగిపోతోంది. కొద్దిరోజులు బాగానే ఉన్న ఆయన ఆరోగ్యం నిన్న మళ్లీ విషమించినట్లు కావేరి ఆసుపత్రి వైద్యులు ప్రకటించడంతో పరిస్థితి మారిపోయింది.

24 గంటలు గడిస్తేకానీ కరుణ ఆరోగ్యంపై ఏమి చెప్పలేమని వైద్యులు చెప్పడంతో.. కరుణానిధి అభిమానులు, డీఎంకే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కావేరి ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. కరుణానిధి ఫోటోలను పట్టుకుని త్వరగా కోలుకుని ఆస్పత్రి నుంచి బయటకు రావాలని ఆకాంక్షిస్తున్నారు. వారి రోదనలతో హాస్పిటల్ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

దీంతో పరిస్థితి అదుపు తప్పకుండా కావేరి ఆషుపత్రి వద్ద ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. డీఎంకే కార్యాలయంతో పాటు నేతల ఇళ్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు.