జయసమాధి పక్కనే కరుణానిధి సమాధి

Karunanidhi To Be Buried Next To Jayalalithaa At Marina. See Plan
Highlights

తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలోని మెరీనాబీచ్‌లో అన్నాదురై,  జయలలిత సమాధుల మధ్యలో కరుణానిధి సమాధిని ఏర్పాటు చేయనున్నారు. 


చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలోని మెరీనాబీచ్‌లో అన్నాదురై,  జయలలిత సమాధుల మధ్యలో కరుణానిధి సమాధిని ఏర్పాటు చేయనున్నారు. ఈ రెండు సమాధుల మధ్య కరుణానిధి సమాధిని ఏర్పాటు చేయనున్నట్టు మద్రాస్ హైకోర్టుకు డీఎంకె ఇచ్చిన ప్లాన్‌లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

మెరీనాబీచ్‌లో తమిళనాడు సీఎం  కరుణానిధి అంత్యక్రియల విషయంలో తమిళనాడు సర్కార్  అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మెరీనాబీచ్‌లో అంత్యక్రియలకు అనుమతి ఇవ్వలేదు. దీంతో కోర్టులో డీఎంకె పిటిషన్ దాఖలు చేసింది.

మద్రాస్ హైకోర్టు మెరీనాబీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. అయితే  దివంగత తమిళనాడు సీఎం జయలలిత సమాధి పక్కనే కరుణానిధిని  ఖననం చేయనున్నారు.

మెరీనాబీచ్‌లోనే మాజీ ముఖ్యమంత్రులు అన్నాదురై, ఎంజీఆర్, జయలలితల సమాధులున్నాయి.  ప్రస్తుతం  కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అన్నాదురై, జయలలిత సమాధుల మధ్యలో  కరుణానిధి సమాధిని ఏర్పాటు చేయనున్నారు. డీఎంకె కోర్టుకు అందించిన నమూనా ప్లాన్‌లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

బతికున్న సమయంలో డీఎంకె చీఫ్ కరుణానిధి, అన్నాడీఎంకె చీఫ్ జయలలితల మధ్య ఉప్పు, నిప్పు మాదిరిగా  పరిస్థితులు ఉండేవి.  ఒకరిపై మరోకరు నిప్పులు చెరిగేవారు. అయితే చనిపోయిన తర్వాత పక్కపక్కనే సమాధులు ఏర్పాటు చేయడం గమనార్హం.


 

loader