డిఎంకె అధినేత ఎం. కరుణానిధి ఆరోగ్యం విషమించింది. దాంతో ఆయనను చెన్నైలోని గోపాలపురం నివాసం నుంచి కావేరీ ఆస్పత్రికి తరలించారు. రక్తం పోటు తగ్గడంతో ఆయనను శనివారం తెల్లవారు జామున ఆస్పత్రికి తరలించారు.

చెన్నై: డిఎంకె అధినేత ఎం. కరుణానిధి ఆరోగ్యం విషమించింది. దాంతో ఆయనను చెన్నైలోని గోపాలపురం నివాసం నుంచి కావేరీ ఆస్పత్రికి తరలించారు. రక్తం పోటు తగ్గడంతో ఆయనను శనివారం తెల్లవారు జామున ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసియులో చికిత్స పొందుతున్నారు. 

ఐదు సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటన్నర ప్రాంతంలో ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. 

మూత్ర నాళాల ఇన్ ఫెక్షన్ కు, వయస్సు సంబంధించిన అనారోగ్యానికి చికిత్స అందిస్తున్నారు. బ్లడ్ ప్రెషర్ తగ్గడంతో ఆస్పత్రికి తరలించినట్లు డిఎంకె నేత ఎ. రాజా చెప్పారు. 

ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ సాధారణ స్థాయిలో ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. వైద్యుల బృందం శుక్రవారం రాత్రి కరుణానిధి నివాసానికి చేరుకుని ఆరోగ్య స్థితిని సమీక్షించారు. కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత ఆస్పత్రికి తరలించాలని నిర్ణయించారు. 

కరుణానిధి ఆరోగ్యం మెరుగుపడిందని ఆయన కుమారుడు స్టాలిన్ శుక్రవారం చెప్పారు. 94 ఏళ్ల కరుణానిధి మూత్ర నాళాల వ్యాధితో బాధపడుతున్నారని కావేరీ ఆస్పత్రి వైద్యులు శుక్రవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో తెలిపారు. 

డిఎంకె నాయకులు, కార్యకర్తలు పెద్ద యెత్తున కావేరీ ఆస్పత్రికి చేరుకుంటున్నారు. శుక్రవారం నాడు తమిళనాడు డిప్యూటీ సిఎం ఓ పన్నీరు సెల్వంతో పాటు వివిధ పార్టీల నాయకులు కరుణానిధి నివాసానికి క్యూ కట్టారు.

Scroll to load tweet…