భారతదేశ రాజకీయాల్లో కరుణానిధి శకం ప్రబలమైనది. దేశంలోని సీనియర్ రాజకీయ నేతల్లో ఆయన ఒకరు. స్వాతంత్య్రానికి పూర్వం రాజకీయ జీవితాన్ని ప్రారంభించి.. ఆధునిక దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన వ్యక్తి కరుణానిధి ఒక్కరే అంటారు విశ్లేషకులు

భారతదేశ రాజకీయాల్లో కరుణానిధి శకం ప్రబలమైనది. దేశంలోని సీనియర్ రాజకీయ నేతల్లో ఆయన ఒకరు. స్వాతంత్య్రానికి పూర్వం రాజకీయ జీవితాన్ని ప్రారంభించి.. ఆధునిక దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన వ్యక్తి కరుణానిధి ఒక్కరే అంటారు విశ్లేషకులు. ఎన్నికల్లో వ్యక్తిగతంగా ఓటమి ఎరుగని నాయకుడు కరుణానిధి.

17 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించిన కరుణ... ద్రవిడ మున్నేట్ర కళగం స్థాపించినప్పుడు అన్నాదురైకి సన్నిహితంగా మెలిగి.. పార్టీ ప్రచార కమిటీ సభ్యుడిగా నియమించబడ్డారు అప్పుడు ఆయన వయసు పాతికేళ్లే.. 1957లో కులిత్తాలై నియోజకవర్గం నుంచి తొలిసారి ఎంఎల్ఏగా గెలిచిన కరుణానిధి...2016లో తిరువారుర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. మొత్తం 13 ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఒక్కసారి కూడా ఓడిపోలేదు.