విషమించిన కరుణానిధి ఆరోగ్యం: హుటాహుటిన సేలం నుండి చెన్నైకి పళనిస్వామి

Karunanidhi health condition serious:palaniswamy returning to chennai from salem,
Highlights

కరుణానిధి ఆరోగ్యంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి పళనిస్వామి తన సేలం పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకుని చెన్నైకి బయలుదేరారు. చెన్నైలో హై ఆలర్ట్ ప్రకటించారు. డిఎంకె కార్యాలయం వద్ద భద్రతా ఏర్పాట్లు చేశారు.

చెన్నై:డీఎంకె చీఫ్ కరుణానిధి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని కావేరి ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. సేలం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి పళనిస్వామి హుటాహుటిన చెన్నైకు బయలుదేరారు.

డీఎంకె ప్రధాన కార్యాలయం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కరుణానిధి కుటుంబసభ్యులంతా  కావేరీ ఆసుపత్రికి చేరుకొన్నారు. కరుణానిధి ఆరోగ్యం విషమించిందని కావేరీ ఆసుపత్రి వైద్యులు ప్రకటించిన నేపథ్యంలో సీఎం పళనిస్వామి అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకొన్నారు.

సేలం నుండి సీఎం పళనిస్వామి చెన్నైకు చేరుకొంటారు. చెన్నైలోని కావేరీ ఆసుపత్రికి చేరుకొనే అవకాశం ఉంది.అయితే కరుణానిధి కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేరుకోవడంతో పాటు పోలీసులకు సెలవులను రద్దు చేశారు.

మరోవైపు ఆసుపత్రి వద్దకు చేరుకొంటున్న కార్యకర్తలను కరుణానిధి ఆరోగ్యం బాగానే ఉందని ఆసుపత్రి వర్గాలు, పోలీసులు ప్రకటించారు. డీఎంకె కార్యకర్తలను ఇళ్లకు తిరిగి వెళ్లాలని ఆదేశించారు. అంతేకాదు చెన్నైలో హైఅలర్ట్ విధించారు.

డీఎంకె కార్యాలయం వద్దకు భారీగా కార్యకర్తలు చేరుకొన్నారు. అయితే డీఎంకె కార్యాలయం వద్దకు చేరుకొన్న కార్యకర్తలను పోలీసులను వెంటనే పంపించివేస్తున్నారు. మరో వైపు ఆసుపత్రి వద్దకు కూడ భారీగా డీఎంకె కార్యకర్తలు చేరుకొంటున్నారు. 

loader