కరుణానిధి పరిస్థితి విషమం.. లండన్ నుంచి ప్రత్యేక వైద్యులు

karunanidhi health condition is critical
Highlights

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్య పరిస్థితి విషమించినట్లుగా వార్తలు వస్తున్నాయి. మూత్రనాళ వ్యాధితో బాధపడుతున్న కరుణానిధి ప్రస్తుతం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అయితే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. చికిత్సకు స్పందిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న కరుణానిధికి మెరుగైన వైద్యం అందించేందుకు గాను లండన్ నుంచి వైద్యులను రప్పించాలని కుటుంబసభ్యులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కరుణ ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలియడంతో కావేరి ఆస్పత్రికి డీఎంకే నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది.

loader