తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి అంతిమయాత్ర మెరీనా బీచ్‌కు చేరుకుంది.. రాజాజీహాలు నుంచి ఆయన పార్థీవదేహాన్ని పూలతో అలంకరించిన సైనిక వాహనంలోకి చేర్చారు. అనంతం త్రివిధ దళాలకు చెందిన సైనిక సిబ్బంది వెంటరాగా.. ఆయన అంతిమయాత్ర బయలుదేరింది.

రాజాజీహాలు నుంచి వాలాజారోడ్, చెపాక్ స్టేడియం మీదుగా కరుణానిధి అంతిమయాత్ర సాగింది.. తమ అభిమాన నేతకు కడసారి వీడ్కోలు తెలిపేందుకు డీఎంకే కార్యకర్తలు, ప్రజలు దారిపొడవునా బారులు తీరారు.

అంత్యక్రియలకు హాజరైన ప్రముఖులు:
కరుణానిధి అంతిమయాత్రకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, గులాంనబీ అజాద్‌, తెదేపా అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎన్సీపీ నేత శరద్‌పవార్‌, వివిధ పార్టీల నేతలు మెరీనాబీచ్‌కు చేరుకున్నారు.