కరుణానిధి కన్నుమూత: తమిళనాడులో ఫోన్ ఔట్ గోయింగ్ బ్లాక్

Karuannaidhi dead: Phone outgoing blacked
Highlights

డిఎంకె అధినేత, కలైంజ్ఞర్ కన్నుమూతతో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉండడంతో తమిళనాడు ప్రభుత్వం పలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఫోన్ ఔట్ గోయింగ్ ను ఆపేశారు. ఉహాగానాలు ప్రచారం కాకుండా ఆ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

చెన్నై:  డిఎంకె అధినేత, కలైంజ్ఞర్ కన్నుమూతతో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉండడంతో తమిళనాడు ప్రభుత్వం పలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఫోన్ ఔట్ గోయింగ్ ను ఆపేశారు. ఉహాగానాలు ప్రచారం కాకుండా ఆ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

రేపు ఉదయం 7 గంటల నుంచి అంతిమ దర్శనానికి కరుణానిధి పార్థివదేహాన్ని రాజాజీ హాలులో ఉంచుతున్నారు. పరిస్థితి ఇప్పటికే చెన్నైలో ఉద్రిక్తంగా మారింది. గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి డిఎంకె కార్యకర్తలు పెద్ద యెత్తున చేరుకుంటున్నారు. 

రేపు సాయంత్రం 4 గంటలకు కరుణానిధి అంత్యక్రియలు జరుగుతాయి. మెరీనా బీచ్ వద్దే కరుణానిధి అంత్యక్రియలకు అనుమతి ఇవ్వాలని ఆయన కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అభిమానుల కోరిక మేరకు అన్నా స్క్వేర్ లోనే కరుణానిధి అంత్యక్రియలకు అవకాశం కల్పించాలని అడుగుతున్నారు. 

రేపు, ఎల్లుండి తమిళనాడు ప్రభుత్వ కార్యక్రమాలను అన్నింటినీ రద్దు చేశారు. సినిమా హాళ్లు కూడా రెండు రోజుల పాటు మూతపడనున్నాయి. 

loader