చెన్నై: కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం తమిళనాడు రాష్ట్రం నుండి ప్రియాంక గాంధీని పోటీ చేయాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం నాడు ఆయన ఈ మేరకు ఆయన ధరఖాస్తు చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలతో పాటు కన్యాకుమారి ఎంపీ స్థానానికి కూడ ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ ప్రకటించింది.

దీంతో కన్యాకుమారి ఎంపీ స్థానం నుండి ప్రియాంక గాంధీని బరిలోకి దింపాలని కార్తీ చిదంబరం కోరారు. గత ఏడాదిలో కరోనా కారణంగా కాంగ్రెస్ ఎంపీ వసంతముమార్ మరణించాడు. దీంతో ఈ స్థానానికి ఎన్నికలు అనివార్యమయ్యాయి.  ఏప్రిల్ 6న ఈ స్థానానికి ఎన్నికలు జరుగుతాయి.

గత ఏడాదిలో కూడ కార్తీ చిదంబరం ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కోరారు. ట్విట్టర్ వేదికగా తన డిమాండ్ ను ఆయన పార్టీ నేతల ముందుంచారు. ఈ ఏడాది ఏప్రిల్ 6 వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్, డీఎంకె, ఎఐఏడిఎంకె, బీజేపీ కూటములుగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి.