భర్త గత 11 సంవత్సరాలుగా తనను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఓ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను చిత్ర హింసలకు గురిచేస్తున్న భర్త కూడా ఓ పోలీసు అనీ, ఆయన నలుగురు భార్యలు ఉన్నారని ఫిర్యాదులో పేర్కొంది.
Karnataka: తన భర్తకు నలుగురు భార్యలు ఉన్నారనీ, గత 11 సంవత్సరాలుగా తనను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఓ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను చిత్ర హింసలకు గురిచేస్తున్న భర్త కూడా ఓ పోలీసు అనీ, ఆయన నలుగురు భార్యలు ఉన్నారని ఫిర్యాదులో పేర్కొనడం సంచలనంగా మారింది.
కర్నాటకలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి... బెంగళూరుకు చెందిన ప్రత్యేక బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ పీఎం బాబుపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఫిర్యాదులో ఆయనకు నలుగురు భార్యలు ఉన్నారని పేర్కొంది. ఆయన తనను 11 సంవత్సరాల నుంచి చిత్రహింసలు పెడుతున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఇంట్లో నెలకొన్న పరిస్థితుల గురించి అనేక సార్లు పోలీసు ముందుర చెప్పి చూసినా ఫలితం లేకుండా పోయిందని తెలిపింది. అతని ఎలాంటి మార్పు రాలేదని పేర్కొంది. ఎలాగైన తనకు న్యాయం చేయాలని ఆమె గిరినగర పోలీసులను కోరింది. దీనిపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తల్లి సహా ఇద్దరు పిల్లలు మృతి..
కర్నాటకలో తల్లి సహా ఇద్దరు పిల్లలు శవాలై కనిపించిన ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. శివమొగ్గ తాలూకాలోని కుంసి సమీపంలోని చోరాడి వద్ద ఒక మహిళ మరియు ఆమె ఇద్దరు శిశువులు చనిపోవడంతో.. ఆమె భర్త మరియు అతని బంధువులు కట్నం కోసం ముగ్గురిని హత్య చేశారని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మే 15న శివమొగ్గ తాలూకాలోని కుమ్సి సమీపంలోని చోరాడి వద్ద ఒక మహిళ మరియు ఆమె ఇద్దరు శిశువులు మృతి చెందారు. మృతులను జ్యోతి (25), ఆమె రెండున్నరేళ్ల కుమార్తె మరియు 11 నెలల కుమారుడుగా గుర్తించారు. వరకట్నం కోసం ఆమె భర్త, అతని బంధువులు ముగ్గురిని హత్య చేశారని జ్యోతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దావణగెరె జిల్లా సాస్వేహళ్లికి చెందిన జ్యోతికి చోరడికి చెందిన శివమూర్తితో 2018లో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. శివమూర్తి, అతని తల్లిదండ్రులు, మరో ఇద్దరు బంధువులు జ్యోతిని వరకట్నం కోసం వేధించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో తల్లిదండ్రులు ఆమెను పసికందులతో సహా స్వగ్రామానికి తీసుకెళ్లారు. భర్త నుంచి పదే పదే ఫోన్ కాల్స్ రావడంతో మే 9న జ్యోతిని భర్త ఇంటికి పంపించారు. అయితే, మే 15 సాయంత్రం ముగ్గురు శవమై కనిపించారు. హత్యా నేరం కింద కుమ్సి పోలీసులు కేసు నమోదు చేశారు. శివమూర్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతున్నదని తెలిపారు.
