హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. ప్రస్తుతం ఆలయాలపై ఉన్న ప్రభుత్వ నియంత్రణను ఎత్తేస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం నిర్వహించిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా  ఆయన ప్రసంగిస్తూ ఈ విషయాన్ని ప్రకటించారు. 

ఆలయాలపై ప్రభుత్వ నియంత్రణకు స్వస్తి పలికి, ఎండోమెంట్ శాఖ (Endowment Department) పరిధిలోకి వచ్చే ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని క‌ర్ణాట‌క ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (karnataka cm Basavaraj Bommai) అన్నారు. ఈ మేర‌కు నేడు నిర్వ‌హించిన అసెంబ్లీ బ‌డ్జెట్ సమావేశాల్లో ఆయ‌న ఈ ప్ర‌క‌ట‌న చేశారు. ఆలయాలపై ప్రభుత్వ నియంత్రణను తొలగించాలన్న డిమాండ్ చాలా కాలంగా పెండింగ్‌లో ఆయ‌న త‌న ప్ర‌సంగంలో పేర్కొన్నారు. 

సీఎం పదవి చేపట్టాక తొలిసారిగా బసవరాజ్ బొమ్మై (Basavaraj Bommai) అసెంబ్లీ లో బడ్జెట్ పై సీఎం హోదాలో ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. చాలా కాలంగా భక్తుల నుంచి వ‌స్తున్న డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు స్వయం ప్రతిపత్తి (autonomy) కల్పిస్తామని చెప్పారు. అభివృద్ధి పనుల విచక్షణాధికారాన్ని ఆలయాలకు అప్పగించేందుకు అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. 

హిందూ దేవాలయాలు వివిధ రకాల నియంత్రణ నియమాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలోని దేవాలయాలు, హిందువుల మత సంస్థలను ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తి చేయడానికి తమ ప్రభుత్వం కొత్త బిల్లును ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు గత సంవత్సరం డిసెంబర్‌ (december)లో బొమ్మై ప్రకటించారు. హుబ్లీలో జరిగిన బీజేపీ (barathiya janatha party) రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సీఎం దీనిని ప్ర‌స్తావించారు. బడ్జెట్ (budjet) సమావేశానికి ముందే రాష్ట్రంలోని ఆలయాలను అలాంటి ఆంక్షలు లేకుండా చేయడానికి చట్టం రూపొందిస్తామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. 

హిందూ మత సంస్థలు, ధర్మాదాయ శాఖ వెబ్‌సైట్ ప్రకారం..రాష్ట్రంలో 34,558 దేవాలయాలు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నాయి. హిందూ దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తం చేయాలని ఆర్ఎస్ఎస్ (RSS) ఎప్ప‌టి నుంచో డిమాండ్ చేస్తోంది. సీఎం ప్ర‌క‌ట‌న‌పై కాంగ్రెస్ (congress) స్పందించింది. ఇది చారిత్రాత్మక తప్పిదం అని అభివర్ణించింది. కాగా.. కర్ణాటకలోని దేవాలయాలను మూడు వర్గాలుగా విభజించారు. ఏడాదికి రూ.25 లక్షల కంటే ఎక్కువ ఆదాయం పొందే ఆల‌యం ఏ కేటగిరీలో, రూ.5-10 లక్షల మధ్య ఆదాయం వచ్చే ఆలయాలు బీ కేటగిరీలో, మిగిలిన‌వ‌న్నీ సీ కేటగిరీలో ఉన్నాయి.

నమ్మ క్లినిక్‌లు, పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి..
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయిస్తుంద‌ని సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. వెన‌క‌బ‌డిన తరగతుల విద్యార్థుల హాస్టళ్లకు రూ.165 కోట్లు నిధులు కేటాయిస్తున్నట్లు సీఎం చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో కొత్త ఫర్నీచర్‌ కోసం రూ.100 కోట్లు వెచ్చించనున్న‌ట్టు తెలిపారు. 

రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమ్మ క్లినిక్‌ (Namma clinics)లు ఏర్పాటు చేస్తామ‌ని అన్నారు. ఇవి బెంగ‌ళూరు ప‌ట్ట‌ణంలోని అన్ని వార్డుల్లో ఏర్పాటు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ క్లినిక్‌లలో నాన్-కమ్యూనికేబుల్ (non-communicable) వ్యాధులను గుర్తించి, మెరుగైన చికిత్స కోసం నిపుణులకు రిఫ‌ర్ సేవ‌లు అందిస్తార‌ని తెలిపారు. మేకేదాటు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (Mekedatu balancing reservoir), బెంగళూరు తాగునీటి ప్రాజెక్టు (Bengaluru drinking water project)ను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వద్ద తగిన అనుమతులు తీసుకుని ప్రస్తుత సంవత్సరంలో వెయ్యి కోట్ల రూపాయల గ్రాంట్‌ను అందజేస్తామని సీఎం చెప్పారు.