Coronavirus: కర్నాటకలో కరోనా కల్లోలం.. ఒక్కరోజే 50 వేల కేసులు
Coronavirus: దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్నది. పలు రాష్ట్రాల్లో కోవిడ్-19 విలయతాండవం చేస్తున్నది. దక్షిణాది రాష్ట్రమైన కర్నాటకలో ఒక్కరోజే ఏకంగా 50వేలకు పైగా కొత్త కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ కేసుల్లో సగానికి పైగా ఒక్క బెంగళూరు నగరంలోనే నమోదుకావడంతో స్థానికంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Coronavirus: కరోనా మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభణ కొనసాగుతున్నది. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కోవిడ్-19 కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా అధికమవుతున్నది. చాలా దేశాల్లో నిత్యం లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. భారత్ లోనూ కరోనా ప్రభావం పెరుగుతోంది. రోజువారీ కేసులు మూడు లక్షల మార్కును దాటాయి. చాలా రాష్ట్రాల్లో కొత్తగా కరోనా వైరస్ (Coronavirus) బారినపడుతున్న వారి సంఖ్య అధికంగా పెరుగుతున్నది. పలు రాష్ట్రాల్లో కోవిడ్-19 విలయతాండవం చేస్తున్నది. దక్షిణాది రాష్ట్రమైన కర్నాటకలో ఒక్కరోజే ఏకంగా 50వేలకు పైగా కొత్త కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ కేసుల్లో సగానికి పైగా ఒక్క బెంగళూరు నగరంలోనే నమోదుకావడంతో స్థానికంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
కర్నాటకలో గత 24 గంటల్లో కొత్తగా 50,210 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. అలాగే, కోవిడ్-19 మహమ్మారితో పోరాడుతూ 19 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసుల్లో సగానికి పైగా 26,299 రాష్ట్ర రాజధాని బెంగళూరులో నమోదుకావడం అక్కడ వైరస్ ఉధృతికి అద్దం పడుతున్నది. రాష్ట్రలో కరోనా వైరస్ బారినపడుతన్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు 50,000 దాటడం ఇది రెండోసారి. గతేడాది (2021) మే 5న రాష్ట్రంలో అధికంగా 50,112 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే రోజు 346 మంది వైరస్ కారణంగా చనిపోయారు. వాటితో పోలిస్తే.. ప్రస్తుత మరణాలు చాలా తక్కువగానే ఉన్నప్పటికీ.. కరోనా రోజువారీ కేసులు గణనీయంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది.
కర్నాటకలో కరోనా వైరస్ నుంచి కొత్తగా 22,842 మంది కోలుకున్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19 మహమ్మారి రికవరీల సంఖ్య 31,21,274కు చేరుకుంది. ప్రస్తుతం 3,57,796 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కర్నాటకలో ఇప్పటివరకు మొత్తం నమోదైన కరోనా కేసులు 35,17,682కు చేరగా, మరణాలు 38,582కు పెరిగాయి. కరోనా పాజిటివిటీ రేటు 22.77 శాతంగా ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 9,33,87,186 కరోనా టీకాలను అందించారు. ఆదివారం ఒక్కరోజే 1.10 లక్షల కోవిడ్-19 టీకాలు పంపిణీ చేశారు.
కర్నాటకలో నమోదవుతున్న కరోనా మహమ్మారి కొత్త కేసుల్లో అత్యధికం రాష్ట్ర రాజధాని బెంగళూరులోనే నమోదవున్నాయి. గత 24 గంటల్లో బెంగళూరు సిటీలో 26,299 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కరోనా కారణంగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా కరోనా కేసులు అధికంగా నమోదైన జిల్లాల జాబితాలో మైసూరులో 4,359, తుమకూరులో 1,963, హాసన్‌లో 1,922, ధార్వాడ్‌లో 955, ఉడిపిలో 947, బెంగళూరు రూరల్‌లో 925, బళ్లారిలో 904 కేసులు వెలుగుచూశాయి. బెంగళూరులో ఎనిమిది, శివమొగ్గ, తుమకూరులో ఇద్దరు సహా 10 జిల్లాల్లో ఆదివారం కరోనా మరణాలు సంభవించాయి. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేయడంతో పాటు కరోనా పరీక్షలు సైతం భారీ నిర్వహిస్తోంది. ఇప్పటివరకు కర్నాటకలో 6.05 కోట్ల కరోనా పరీక్షలు నిర్వహించారు. అలాగే, 9.33 కోట్ల కరోనా టీకాలు పంపిణీ చేశారు.