బెంగుళూరు: భార్య శవం పక్కనే ఓ వ్యక్తి  వారం రోజుల పాటు  ఉన్నాడు. భార్య మృతి చెందిన విషయం కూడ ఎవరికి చెప్పలేదు.  భార్య సోదరుడు ఇంటికి వచ్చిన తర్వాత అసలు విషయం  వెలుగు చూసింది.  ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకొంది.

కర్ణాటక రాష్ట్రంలోని  కర్వాడ్‌లోని కేహెచ్‌బీ కాలనీలో ఆనంద్,గిరిజ దంపతులు నివసిస్తున్నారు. వీరికి సంతానం లేదు.  గిరిజ  పలు ఇళ్లలో పనిచేసేది. ఆనంద్‌కు  పక్షవాతం రావడంతో  గిరిజ పనిచేస్తేనే వారికి పూట గడిచేది.

పక్షవాతం కారణంగా ఆనంద్ మంచానికే పరిమితమయ్యాడు. అయితే వారం రోజులుగా  గిరిజ ఇంటి నుండి బయటకు రాలేదు. గిరిజ  గుండెపోటుతో మరణించింది. పక్షవాతం కారణంగా ఆనంద్ మంచానికే పరిమితమయ్యాడు. దీంతో వారం రోజులుగా  గిరిజ మృతదేహం పక్కనే ఆనంద్ పడుకొన్నాడు.

గిరిజకు ఆమె సోదరుడు పలుమార్లు ఫోన్ చేసినా స్పందన రాలేదు.  దీంతో ఇంటికి వచ్చి తలుపులు కొట్టాడు. కానీ, తలుపులు తీయలేదు. దీంతో ఇల్లు పైకి ఎక్కి ఆయన లోపలికి చూశాడు. గిరిజ శవం పక్కనే ఉన్న మంచంపై  ఆనంద్ ఉన్న విషయాన్ని గుర్తించాడు. 

వెంటనే తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లాడు. గిరిజ మృతదేహం నుండి దుర్వాసన వస్తోంది.  ఆనంద్ కు వారం రోజులుగా అన్న పానీయాలు లేకపోవడంతో  చిక్కిశల్యమయ్యాడు. గిరిజ సోదరుడు పోలీసులకు సమాచారమిచ్చాడు