Asianet News TeluguAsianet News Telugu

మాస్క్ మళ్లీ మ్యాండేటరీ.. ‘జలుబు’ ఉంటే కరోనా టెస్టులు తప్పనిసరి

కర్ణాటక ప్రభుత్వం మాస్క్‌ను మళ్లీ మ్యాండేటరీ చేస్తున్నది. క్లోజ్‌డ్ లొకేషన్స్, ఏసీ గదుల్లో, ఇండోర్ ప్లేస్‌లలో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆదేశించింది. అంతేకాదు, ఇన్‌ఫ్లుయెంజా లైక్ ఇల్‌నెస్, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి కరోనా టెస్టులు తప్పనిసరిగా చేపట్టాలని తెలిపింది.
 

karnataka orders masks mandatory in indoors
Author
First Published Dec 22, 2022, 8:03 PM IST

బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం మాస్క్ ధరించడాన్ని మళ్లీ తప్పనిసరి చేసింది. ఇండోర్‌లలో, ఎయిర్ కండీషన్డ్ రూముల్లో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు. అంతేకాదు, ఫ్లూ సింప్టమ్స్ ఉన్నా వెంటనే కరోనా టెస్టులు చేసుకోవాలని ఆదేశించారు. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికుల్లో ర్యాండమ్‌గా రెండు శాతం మందికి కరోనా టెస్టులు చేయాలనే నిబంధనను పాటిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనను మళ్లీ సవరించే దాకా అలాగే పాటిస్తామని వివరించారు. చైనాలో కరోనా కేసులు పెరగడంతో దేశవ్యాప్తంగా ఈ వైరస్ పై అప్రమత్తం అయ్యారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అలర్ట్ చేసింది.

కర్ణాటకతోపాటే మరికొన్ని రాష్ట్రాలు కూడా కరోనా ముప్పు నుంచి తప్పించుకోవడానికి మాస్క్ ధరించాలనే వైపు మొగ్గు చూపుతున్నాయి. మాస్కులు ధరించడాన్ని గట్టిగా ఎంకరేజ్ చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. కాగా, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా అదే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. మాస్కు ధరించే నిర్ణయం పై తాము కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని కేజ్రీవాల్ తెలిపారు.

Also Read: బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించండి.. సమావేశాలకు దూరంగా ఉండండి : ప్రజలకు ఐఎంఏ సూచన

కాగా, కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్.. సీఎం బసవరాజు బొమ్మై సారథ్యంలో జరిగిన సమావేశం తర్వాత విలేకరులతో మాట్లాడారు. ఇండోర్ లొకేషన్లు, క్లోజ్‌డ్ స్పేసెస్‌లో, ఏసీ రూముల్లో మాస్క్ ధరించాలని చెబుతూ త్వరలోనే తాము అడ్వైజరీ విడుదల చేస్తామని మంత్రి సుధాకర్ వివరించారు. అలాగే, ఇన్‌ఫ్లుయెంజా లైక్ ఇల్‌నెస్ ఉన్నవారు, రెస్పిరేటరీ సమస్యలతో ఉన్నవారికి కరోనా టెస్టు తప్పనిసరిగా చేపడుతామని తెలిపారు.

అంతేకాదు, ముందుజాగ్రత్తగా ప్రభుత్వ హాస్పిటల్స్‌లో కొవిడ్ డెడికేటెడ్ వార్డులను ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. జిల్లా ప్రభుత్వ హాస్పిటళ్లలో సరిపడా బెడ్లు, ఆక్సిజన్ సప్లైతో కొవిడ్ వార్డులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతేకాదు, కరోనా పేషెంట్లకు చికిత్స అందించడానికి ప్రైవేటు హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌తో మాట్లాడి బెడ్లు రిజర్వ్ చేస్తామని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios