భారతదేశంలో చాలా మంది ఆధునిక మహిళలు singleగా ఉండాలనుకుంటున్నారు. వారు వివాహం చేసుకున్నప్పటికీ, పిల్లలు కనడానికి ఇష్టపడడం లేదు. వారికి surrogacy కావాలి.
బెంగళూరు : కర్ణాటక ఆరోగ్య మంత్రి డాక్టర్ కె సుధాకర్ ఆదివారం మహిళల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, ఆధునిక భారతీయ మహిళలు ఒంటరిగా ఉండాలని కోరుకుంటున్నారని, వివాహం తర్వాత కూడా పిల్లలకు జన్మనివ్వడానికి ఇష్టపడడం లేదన్నారు. పిల్లలకోసం సరోగసీ మీద ఆధారపడాలని కోరుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోలాజికల్ సైన్సెస్ (NIMHANS) లో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆదివారం మాట్లాడుతూ..."ఈ రోజు, నేను ఈ విషయం చెబుతున్నందుకు క్షమించండి, భారతదేశంలో చాలా మంది ఆధునిక మహిళలు singleగా ఉండాలనుకుంటున్నారు. వారు వివాహం చేసుకున్నప్పటికీ, పిల్లలు కనడానికి ఇష్టపడడం లేదు. వారికి surrogacy కావాలి. మన ఆలోచన విధానంలో ఇలాంటి మార్పు వస్తోంది. ఇది అంత మంచిది కాదు" అన్నారు.
భారతీయ సమాజంపై "పాశ్చాత్య ప్రభావం" గురించి మంత్రి విచారం వ్యక్తం చేశారు. దీంతోపాటు ప్రజలు తమ తల్లిదండ్రులను తమతో ఉంచుకోవడానికి ఇష్టపడటం లేదని అన్నారు. "ఎంత దురదృష్టం అంటే.. ఈ రోజు మనం పాశ్చాత్యలను అనుసరిస్తున్నాం. వారి మార్గంలో వెళ్తున్నాం. జన్మనిచ్చిన తల్లిదండ్రులనే మనతో జీవించడానికి ఇష్టపడడం లేదు. ఇక తాతలు, అమ్మమ్మలు, నాన్నమ్మల సంగతి మర్చిపోండి’’ అని అన్నారు.
భారతీయుల్లో mental health గురించి మాట్లాడుతూ, ప్రతి ఏడుగురిలో ఒకరు ఏదో ఒక రకమైన మానసిక సమస్యతో ఉంటున్నారని.. ఇది తేలికపాటి నుంచి తీవ్రమైన సమస్య వరకు ఉంటుందని సుధాకర్ అన్నారు. ఇంకా సుధాకర్ ఏమంటారంటే.. stress management ఒక కళ. ఈ కళను భారతీయులు నేర్చుకోవలసిన అవసరం లేదు. కానీ దానిని ఎలా నిర్వహించాలో ప్రపంచానికి బోధించాలి అన్నారు..
ఎందుకంటే మనకు యోగా, ధ్యానం, ప్రాణాయామం లాంటివి మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితంనుంచే ప్రపంచానికి నేర్పిన అద్భుతమైన సాధనాలు అంటూ చెప్పుకొచ్చారు. కోవిడ్ -19 నేపథ్యంలో మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నది. బంధువులను.. తమ ఆత్మీయులను, ప్రియమైనవారిని తాకలేకపోవడం వారికి మానసిక వేదన కలిగించిందని సుధాకర్ చెప్పారు.
"మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వు కోవిడ్ -19 రోగులకు కౌన్సెలింగ్ చేయడం ప్రారంభించింది. ఇప్పటి వరకు మేము కర్ణాటకలో 24 లక్షల మంది కోవిడ్ -19 రోగులకు కౌన్సెలింగ్ చేశాం. మరే ఇతర రాష్ట్రం ఇలా చేయగా నేను చూడలేదు" అని సుధాకర్ అన్నారు.
లఖీంపూర్ ఖేరీ హింస: మోడీపై విమర్శలు.. దుర్గా స్తుతితో ప్రసంగం ప్రారంభించిన ప్రియాంకా గాంధీ
NIMHANSకు తన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇన్స్టిట్యూట్ తన డిజిటల్ ప్లాట్‌ఫామ్ నుండి ప్రజలకు కౌన్సిలింగ్ ఇస్తోందని, టెలి మెడిసిన్ అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ముందుగా మాట్లాడిన కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియాకు కూడా సుధాకర్ కృతజ్ఞతలు తెలిపారు, సెప్టెంబర్ నుండి ప్రతి నెలా కర్ణాటకకు 1.5 కోట్ల కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించామని, ఇది రాష్ట్రంలో టీకాల కవరేజీని పెంచిందని అన్నారు.
ప్రధాన మంత్రి narendra modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 94 కోట్ల వ్యాక్సిన్లను దేశవ్యాప్తంగా ఉచితంగా అందించిందని ఇది చాలా ప్రశంసనీయమని అన్నారు. ఈ టీకా డ్రైవ్ వల్ల దేశజనాభాకు మహమ్మారి కోరలనుంచి జాగ్రత్తగా ఉండే అవకాశం కలిగించారన్నారు.
"ఉచితంగా వ్యాక్సిన్లను అందిస్తున్న ఏకైక దేశం మనదేనని... మిగిలిన చోట్ల, ప్రజలు ఒక్కో టీకాకు రూ. 1,500 నుండి రూ 4,000 వరకు వసూలు చేస్తున్నారు" అని సుధాకర్ చెప్పారు.
