Asianet News TeluguAsianet News Telugu

కృష్ణాష్టమి వేడుక‌ల్లో అప‌శృతి.. ఉట్టి కొడుతూ జారిపడ్డ యువకుడు.. చిక్సిత పొందుతూ మృతి..

ముంబైలో నిర్వహించిన దహీ హండి'(ఉట్టి కొట్టే) వేడుకలల్లో అప‌శృతి చోటుచేసుకుంది. ఓ యువ‌కుడు  ఉట్టికొడుతూ పట్టు తప్పి కింద పడిపోగా, తలకు బలమైన దెబ్బ తగలడంతో సమీపంలోని కూపర్ ఆస్పత్రికి తరలించారు. ఈక్ర‌మంలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు.

Dahi Handi Participant Falls To Death In Mumbai
Author
Hyderabad, First Published Aug 25, 2022, 2:04 AM IST

ముంబైలోని విలేపార్లే ప్రాంతంలో నిర్వ‌హించిన‌ కృష్ణ జన్మాష్టమి వేడుక‌ల్లో అప‌సృతి చోటు చేసుకుంది. 
‘దహీ హండి'(ఉట్టి కొట్టే) వేడుకలల్లో ఘోర ప్రమాదం జరిగింది.  ఉట్టి కొట్టే  కార్య‌క్ర‌మంలో గోవింద సందేశ్ దాల్వీ (24) అనే యువకుడు పై నుంచి కింద ప‌డ్డాడు. దీంతో ఆ యువకుడి త‌ల‌కు తీవ్ర గాయాలయ్యాయి. నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సందేశ్ దాల్వీ  మరణించాడు. అదే సమయంలో, ఈ కేసులో, ఈవెంట్ నిర్వాహకుడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

వివరాల్లోకెళ్తే.. శుక్రవారం విలే పార్లే ప్రాంతంలోని బామన్‌వాడి వద్ద కృష్ణ జన్మాష్టమి వేడుకల‌ను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా  'గోవింద్' (దహీ హండి పార్టిసిపెంట్స్) లు మానవ పిరమిడ్ ఆకృతిలో నిలబ‌డ్డారు. ఈ క్ర‌మంలో శివ శంభో గోవింద పాఠక్ గ్రూపు సభ్యుడు సందేశ్ దాల్వీ ఉట్టి  కొట్టాడానికిపై భాగానికి చేరుకున్నాడు. అయితే.. ప్ర‌మాద‌వశాత్తు.. సందేశ్ దల్వీ  అదుపు త‌ప్పి.. పై నుంచి కింద‌కు ప‌డిపోయాడు. దీంతో అత‌ని తలకు తీవ్ర గాయాలయ్యాయి. నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు విలేపార్లే పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. 

అదే సమయంలో, వైద్యుల ప్రకారం.. ఆగస్టు 19 (శుక్రవారం) జన్మాష్టమి సందర్భంగా తీవ్రంగా గాయపడిన రోగిని మొదట మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ఆర్‌ఎన్ కూపర్ ఆసుపత్రిలో చేర్చారు, తరువాత నానావతి ఆసుపత్రిలో చేరారు.

రోగి తలకు తీవ్ర గాయాలు
 
 నానావ‌తి ఆస్ప‌త్రి వైద్యులు మాట్లాడుతూ.. బాధిత యువ‌కుడికి తలకు తీవ్రమైన గాయాలు ఉన్నాయి. అతనికి శస్త్రచికిత్స చేసిన ఫ‌లితం లేకుండా పోయింది.  ప్రాణాలతో కొట్టుమిట్లాడుతూ.. సోమవారం రాత్రి 9 గంటలకు మృతి చెందాడు. ఇదిలా ఉంటే.. దహీ హండి పోటీలో 222 మంది గాయపడ్డారు, వారిలో 204 మంది చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు, 17 మంది ఆసుపత్రి పాలయ్యారు.

నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే .. 
 
ఈ ఘ‌టన‌లో సందేశ్ దల్వీ అనే యువ‌కుడు చ‌నిపోవ‌డంతో ఈవెంట్ నిర్వాహకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, ఈ విషయంలో తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు  

మరోవైపు, కృష్ణ జన్మాష్టమి నాడు దహీ హండి వేడుకల్లో 111 మంది 'గోవిందా'లు గాయపడ్డారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు ఈ మేరకు సమాచారం అందించారు. గాయపడిన వారిలో ఎక్కువ మంది చికిత్స తర్వాత డిశ్చార్జ్ అయ్యారని, 23 మంది ఆసుపత్రిలో చేరారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని BMC ఒక ప్రకటనలో తెలిపింది. గాయపడిన 'గోవింద మండలి' సభ్యులకు ఉచితంగా చికిత్స అందించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేసింది. గాయపడిన వారిలో 33 మంది కేఈఎం ఆస్పత్రిలో, 12 మంది జీటీ ఆస్పత్రిలో, 10 మంది రాజావాడి ఆస్పత్రిలో, 11 మంది నాయర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios