నెలవారీగా లంచం సమర్పించకోవాలని మంత్రి డిమాండ్!.. ఆ శాఖ డైరెక్టర్ల లేఖతో కలకలం.. సీఎం సిద్ధరామయ్య ఏమన్నారంటే?
కర్ణాటక ప్రభుత్వంపై సంచలన అవినీతి ఆరోపణలు వచ్చాయి. వ్యవసాయ శాఖ మంత్రి తమ నుంచి నెల రూ. 8 లక్షలు అందించాలని మంత్రి డిమాండ్ చేశారని పేర్కొన్నాయి. తమను మంత్రి లంచం కోసం ఒత్తిడి చేస్తున్నారని ఆ శాఖకు చెందిన డైరెక్టర్లు గవర్నర్‌కు రాసినట్టుగా చెబుతున్న ఓ లేఖ రాజకీయంగా దుమారం రేపుతున్నది.
బెంగళూరు: కర్ణాటకలో అధికారాన్ని ఏర్పాటు చేయడం కాంగ్రెస్‌కు నైతికంగా ఎంతో బలాన్ని ఇచ్చింది. అంతకు ముందున్న అక్కడి బసవరాజు బొమ్మై సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ తీవ్ర అవినీతి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 40 శాతం కమీషన్లు అంటూ ప్రచారం చేసి అద్భుత విజయాన్ని సాధించింది. ఈ విజయం సాధించి ఇంకా ఏడాది నిండకముందే అదే అవినీతి ఆరోపణలను ప్రస్తుత సిద్ధరామయ్య సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటున్నది. అయితే, సీఎం సిద్ధరామయ్య వెంటనే అలర్ట్ అయ్యారు.
వ్యవసాయ శాఖ మంత్రి చలువరాయ స్వామి అధికారులపై లంచం కోసం ఒత్తిడి పెంచాడని ఆరోపణలు గుప్పుమన్నాయి. నెలకు రూ. 8 లక్షల లంచం సమర్పించాలని ఒత్తిడి చేసినట్టు ఆ శాఖ డైరెక్టర్లు కొందరు గవర్నర్‌కు లేఖ రాశారని, ఆ లేఖ లీక్ అయిందనే వార్తలు వచ్చాయి. ఆ లీక్ అయిన లేఖలో కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు ఉన్నాయి. మంత్రి అలా లంచం కోసం ఒత్తిడి చేస్తే తాము కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాల్సిన అగత్యం ఏర్పడుతుందని బాధితులు పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలకు దిగింది. సిద్ధరామయ్య ప్రభుత్వం అవినీతికి మారుపేరుగా మారిపోయిందని ఆరోపణలు చేసింది. అయితే, సిద్ధరామయ్య మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు.
Also Read: By-election: 6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
తమ ప్రభుత్వంలో అవినీతి లేదని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఈ లేఖ అవాస్తవం అని పేర్కొన్నారు. ప్రతిపక్షాల కుట్రగానే దీన్ని భావించాలని వివరించారు. ఈ లేఖ నకిలీదని పోలీసులు గుర్తించారు. తమ ప్రభుత్వానికి అవాంతరాలు కల్పించాలనే లక్ష్యంతో బీజేపీ, జేడీఎస్‌లు నాటకాుల ఆఢారు. అయినప్పటికీ ఈ వ్యవహారంలో సీఐడీ దర్యాప్తునకు ఆదేశించినట్టు స్పష్టం చేశారు.