కర్ణాటకలో వెలుగులోకి వచ్చిన ‘లిప్ లాక్ వీడియో’ ఘటనలో ఎనిమిది మంది విద్యార్థులని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 

మంగళూరు : College students చేష్టలు ఒక్కోసారి మరీ విశృంఖలంగా మారుతున్నాయి. అంతే కాకుండా ఆ చర్యలను వారు సమర్ధించుకునే ఈ క్రమంలో videoలు తీసి Social mediaలో షేర్ చేస్తుండడం విస్మయం కలిగిస్తుంది. ఇలాంటిదే.. తాజాగా కర్ణాటకలో వెలుగుచూసింది. ఓ ప్రముఖ కాలేజీకి చెందిన విద్యార్థుల Lip lock challenge వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ వీడియో వెలుగులోకి రావడంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ ఘటనకు పాల్పడిన విద్యార్థులపై కేసులు నమోదు చేసి.. ఎనిమిది మందిని అరెస్టు చేశారు.

మంగళూరులోని ఓ కాలేజీకి చెందిన స్టూడెంట్స్ ఓ ప్రైవేటు అపార్ట్మెంట్లో గెట్ టుగెదర్ పార్టీ చేసుకున్నారు. ఆ సందర్భంగా ‘ట్రూత్ ఆర్ డేర్’ పోటీల్లో భాగంగా లిప్ లాక్ చాలెంజ్ నిర్వహించారు. ఇందులో భాగంగా యూనిఫాంలో ఉన్న ఒక విద్యార్థినికి మరో విద్యార్థి ముద్దు పెడుతున్నాడు. తోటి విద్యార్థులు అది చూసి కేరింతలు కొడుతూ వీడియోలు తీశారు. ఆ తర్వాత ఆ గ్రూప్ లోని 17 ఏళ్ల విద్యార్థి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ ఘటన ఆరు నెలల క్రితమే జరిగినప్పటికీ… వీడియో ఇటీవల పోస్ట్ చేయడంతో బాధ్యత అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.

కాలేజీ యూనిఫామ్ లో స్టూడెంట్ల లిప్ లాక్ ఛాలెంజ్.. వైర‌ల్ గా మారిన వీడియో..

ఈ వ్యవహారాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఘటనకు పాల్పడిన ఎనిమిది మంది విద్యార్థులను అరెస్టు చేశారు. వీరిని పోలీసులు విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. ఆ వీడియోని చూపించి ఆ బృందంలోని ఇతర విద్యార్థినులపై వివిధ సందర్భాల్లో తోటి విద్యార్థులు అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో ఎనిమిది మంది విద్యార్థులపై పోక్సో చట్టంతో పాటు ఐపీసీ, ఐటీ యాక్టులోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అరెస్టు తర్వాత వారిని జూనియర్ డిస్టెన్స్ కోర్టులో ప్రవేశ పెట్టినట్లు నగర పోలీస్ కమిషనర్ శశికుమార్ వెల్లడించారు. విద్యార్థుల కార్యక్రమాలపై.. కాలేజీ యాజమాన్యాలు కూడా నిఘా వేసి ఉంచాలని ఆయన ఇటువంటి క్రమశిక్షణారాహిత్యం, దుష్ప్రవర్తన వంటి ఘటనలు చోటు చేసుకుంటే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. 

ఇదిలా ఉండగా, గురువారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో మొదట ఈ విషయం యాజమాన్యం దృష్టికి వెళ్లింది. దీంతో ఆ వీడియోలో లిప్ లాక్ ఛాలెంజ్ లో పాల్గొన్న ఇద్దరిని కాలేజ్ నుంచి సస్పెండ్ చేశారు. వీడియో తీసిన ఓ బాలుడిని విచారణ కోసం పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వైరల్ అయిన ఈ వీడియోలో అనేక మంది స్టూడెంట్స్ యూనిఫామ్ వేసుకొని ఉన్నారు. అందులో ఒక జంట ఒకరికొకరు కిస్ చేసుకుంటూ ఉండగా.. మరి కొందరు క్యాజువల్ గా ఉన్నారు. అబ్బాయిలను ఒకరు తదుపరి జంటను ఈ లిప్ లాక్ కోసం పిలవడం కూడా వినిపిస్తోంది.