ఉద్యోగులకు కర్ణాటక ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు ఉపశమనం కలిగించేందుకు బేసిక్ వేతనంలో 17 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కు తిరిగి వచ్చేందుకు సాధ్యమయ్యే అంశాలను పరిశీలించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
కర్ణాటక ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మెను ముగించేందుకు సీఎం బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు మధ్యంతర ఉపశమనంగా బేసిక్ జీతంలో 17 శాతం పెంపును ప్రకటించింది. అలాగే జాతీయ పెన్షన్ స్కీమ్ నుండి పాత పెన్షన్ స్కీమ్‌కు తిరిగి రావడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి అదనపు ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసిందని ‘టైమ్స్ నౌ’ నివేదించింది. ఈ సందర్భంగా సీఎం మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశం అంతటా ఇతర రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన మార్పులను అధ్యయనం చేసి తమ నివేదికను త్వరగా సమర్పించాలని కమిటీని ఆదేశించామని తెలిపారు.
స్కూలు విద్యార్థులపై దూసుకెళ్లిన ఎస్వీయూ.. ముగ్గురు చిన్నారులు మృతి.. కాలేజీ విద్యార్థి అరెస్ట్...
ఉద్యోగుల ప్రధాన డిమాండ్స్ ఏమిటి ?
రాష్ట్రంలో 7వ వేతన సంఘం అమలు చేయాలని కర్ణాటక ఉద్యోగులు కోరుకుంటున్నారు. అలాగే జాతీయ పెన్షన్ విధానం తొలగించి, పాత పెన్షన్ పథకం (ఓపీఎస్) అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కనీసం 40 శాతం ఫిట్‌మెంట్ సౌకర్యాల అమలు చేయాలని కోరుతున్నారు.
ఉదయం నుంచి కొనసాగుతున్న నిరనలు
తమ డిమాండ్లను నెరవేర్చాలని లేకపోతే నిరవదిక సమ్మెకు దిగుతామని కొంత కాలంగా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి నివేదిస్తున్నాయి. డిమాండ్ లకు ఒప్పుకోకపోతే మార్చి 1వ తేదీ నుంచి విధులకు హాజరు కాకుండా నిరసనలు చేపడుతామని కూడా పేర్కొన్నాయి. అయితే దీనిని అడ్డుకునేందుకు ఉద్యోగ సంఘాలతో సీఎం బొమ్మై చర్చలు జరిపారు. ఈ చర్చలు మంగళవారం అర్ధరాత్రి వరకు సాగాయి. కానీ అవి విఫలం అయ్యాయి.
దీంతో బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు దిగారు. అందులో భాగంగా బెంగళూరులోని బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) క్యాంపస్‌లో నిరసన చేపట్టారు. అయితే సమ్మె నేపథ్యంలో రవాణా, వైద్య, విద్యాశాఖలు సేవలకు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేశాయి. అన్ని పాఠశాలలు తెరిచి ఉంచాలని స్టాండింగ్ ఆదేశాలు ఉన్నాయని విద్యా శాఖ సీనియర్ అధికారి వార్తా సంస్థ ‘పీటీఐ’కి తెలిపారు. ‘‘పాఠశాలలను తెరిచి ఉంచాలని మేము ఆదేశాలు ఇచ్చాం. ఉపాధ్యాయులు రాకపోతే వారు గైర్హాజరు అవుతారు’’ అని అధికారి తెలిపారు.
నోర్కా ఉద్యోగం కోసం కేరళ సీఎంను కలిసిన స్వప్న సురేష్.. వాట్సాప్ చాటింగ్ లో సంచలన విషయాలు
అలాగే ఈ సమ్మె సమయంలో అత్యవసర సేవలు తెరిచి ఉండేలా ఆరోగ్య శాఖ కూడా కసరత్తు చేస్తోంది. ట్రామా, అత్యవసర ఆరోగ్య సేవలకు అంతరాయం కలగకుండా చూసేందుకు జిల్లాల్లోని అన్ని ముఖ్యమైన హాస్పిటల్స్ కు ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.
