కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి శనివారం సాయంత్రం అనారోగ్యతో బెంగళూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. కొన్ని రోజులుగా విశ్రాంతి లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడటంతో ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. 

బెంగళూరు: కర్ణాటకలో ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటున్నది. ప్రచార క్యాంపెయిన్లు ఉధృతంగా సాగుతున్నాయి. ప్రతి పార్టీ వ్యూహాత్మకంగా ప్రత్యర్థి పార్టీని ఇరకాటంలో పెట్టడంతోపాటు తమ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లుతున్నాయి. ఈ కీలక సమయంలో కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి హాస్పిటల్‌లో చేరారు.

శనివారం సాయంత్రం ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చేరారరు. అనారోగ్యం బారిన పడటంతో ఆయన హాస్పిటల్‌లో చేరినట్టు ఆ పార్టీ పేర్కొంది.

ఎన్నికల సీజన్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా హెచ్‌డీ కుమారస్వామి విస్తృత పర్యటనలు చేయాల్సి వచ్చింది. దీంతో ఆయన అనారోగ్యం బారిన పడినట్టు జేడీఎస్ పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

Also Read: నేడు కర్ణాటకు రాహుల్ గాంధీ.. ఎన్నికల రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన

ఆయన ఆదివారం రోజు తన కార్యకలాపాలు అన్నింటినీ వాయిదా వేసుకున్నారు. పార్టీ కార్యకర్తలు తన ఆరోగ్యం గురించి కలత చెందరాదని విజ్ఞప్తి చేశారు. గత కొన్ని రోజులుగా తాను అనారోగ్యం బారిన పడటంతో వైద్యులు రెస్ట్ తీసుకోవాలని సూచించినట్టు వివరించారు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించడంతో తాను హాస్పిటల్‌‌లో అడ్మిట్ అయినట్టు తెలిపారు.