కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. మరో నలుగురు గాయపడ్డారు. వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. మరో నలుగురు గాయపడ్డారు. వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వివరాలు.. కుకనూరు తాలూకాలోని బిన్నాల్ గ్రామానికి చెందిన దేవప్ప కొప్పాడ్ కుటుంబ సభ్యులతో కలిసి కొప్పల్ పట్టణంలోని తన బంధువుల ఇంట్లో జరిగిన పుట్టినరోజు వేడుకకు హాజరయ్యారు. అనంతరం వారు తొమ్మిది మంది స్కార్పియో వాహనంలో తిరుగు ప్రయాణమయ్యారు.
అయితే జిల్లాలోని భానాపూర్ వద్ద వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని.. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతులను దేవప్ప కొప్పాడ్, గిరిజమ్మ కొప్పాడ్, శాంతమ్మ, పార్వతమ్మ, కస్తూరిలుగా గుర్తించారు. మృతదేహాలను మార్చురీకి తరలించారు. క్షతగాత్రులను కూకనూరు, కొప్పల్‌లోని ప్రభుత్వాసుపత్రుల్లో చేర్పించారు. గాయపడినవారిలో స్కార్పియో వాహనం డ్రైవ్ చేస్తున్న హర్షవర్దన్‌తో పాటు పిల్లలు భూమిక, పుట్టరాజ్, పల్లవి ఉన్నారు.

ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు కొప్పల్ ఎస్పీ Arunangshu Giri తెలిపారు. ‘‘ఇది హిట్ అండ్ రన్ కేసు అయి ఉండవచ్చు. కుకనూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. గుర్తుతెలియని వాహనం కోసం అన్వేషణ కొనసాగిస్తున్నాం. ప్రమాద స్థలంలో ఇతర వాహనం విడి భాగం కనుగొనబడింది. స్కార్పియోను లారీ లేదా టిప్పర్ ఢీకొట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మేము కొప్పల్, పొరుగు జిల్లాల టోల్ గేట్ సిబ్బందితో పాటుగా నైట్ డ్యూటీలో ఉన్న పోలీసులతో తనిఖీ చేస్తున్నాము’’ అని చెప్పారు.
Also Read: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు కర్ణాటక పోలీసులు మృతి.. అసలేం జరిగిందంటే?
ఇక, ఈ ప్రమాదంపై మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి Halappa Basappa Achar.. క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిని సందర్శించారు. వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
