Asianet News TeluguAsianet News Telugu

Karnataka Election 2023: బీజేపీ ఏం చేసినా స‌రే అధికారంలోకి వ‌చ్చేది కాంగ్రెస్సె.. : డీకే శివ‌కుమార్

Karnataka Election 2023: బీజేపీ ఏం చేసినా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ క‌ర్నాట‌క చీఫ్ డీకే శివకుమార్ అన్నారు. రాష్ట్రంలోని ప్ర‌జ‌లు కాంగ్రెస్ అధికారంలోకి రావాల‌ని కోరుకుంటున్నార‌ని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీకి విజ‌యం సాధించిపెట్టేందుకు పార్టీ శ్రేణులు తీవ్రంగా కృషి  చేస్తున్నాయ‌ని తెలిపారు. 
 

Karnataka Election 2023: No matter what BJP does, it is the Congress that will come to power. : DK Shivakumar RMA
Author
First Published Apr 22, 2023, 7:31 PM IST

Karnataka Congress President DK Shivakumar: బీజేపీ ఏం చేసినా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ క‌ర్నాట‌క చీఫ్ డీకే శివకుమార్ అన్నారు. రాష్ట్రంలోని ప్ర‌జ‌లు కాంగ్రెస్ అధికారంలోకి రావాల‌ని కోరుకుంటున్నార‌ని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీకి విజ‌యం సాధించిపెట్టేందుకు పార్టీ శ్రేణులు తీవ్రంగా కృషి  చేస్తున్నాయ‌ని తెలిపారు. "బీజేపీ ఏం చేసినా అధికారంలోకి వస్తాం. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. బీజేపీకి చెందిన కొందరు కూడా బీజేపీతో విసిగిపోయారు. ఇప్పుడు బీజేపీ చీలిపోయింది.. రాష్ట్ర ప్ర‌జ‌ల సైతం కాంగ్రెస్ అధికారంలోకి రావాల‌ని కోరుకుంటున్నార‌ని"  డీకే శివకుమార్ అన్నారు.

డీకే శివకుమార్ కుటుంబం ప్రయాణించిన హెలికాప్టర్ తనిఖీ

కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ కుటుంబం బెంగళూరు నుంచి దక్షిణ కన్నడ జిల్లా ధర్మస్థలకు ప్రయాణించిన ఒక ప్ర‌యివేటు హెలికాప్టర్ ను ఎన్నికల అధికారులు శనివారం తనిఖీ చేశారు. శివకుమార్ సతీమణి ఉష, కుమారుడు, కుమార్తె, అల్లుడు ధర్మస్థల మంజునాథ స్వామిని దర్శించుకునేందుకు తీర్థయాత్రకు వెళ్లారు. హెలికాప్టర్ ధర్మస్థలలో ల్యాండ్ కాగానే ఎన్నికల అధికారులు రంగంలోకి దిగి హెలికాప్టర్ ను తనిఖీ చేశారు. ఇది ఎన్నికల విధుల్లో ఉన్న వాహనం కాదని ఎన్నికల సంఘానికి సమాచారం అందడంతో హెలికాప్టర్ ను తనిఖీ చేయాల్సిన అవసరం ఏముందని పైలట్ ప్రశ్నించారు. "మేము ఇప్పటికే లేఖ (ఎన్నికల కమిషన్) ఇచ్చాము" అని పైలట్ చెబుతున్న వీడియో వైరల్ అవుతోంది.

అంత‌కుముందు,  కాంగ్రెస్ అభ్యర్థులపై అనర్హత వేటు వేయాలని సీఎం కార్యాలయం రిటర్నింగ్ అధికారులకు  ఆదేశాలు ఇచ్చింద‌ని క‌ర్నాట‌క కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ చేసిన ఆరోపణలపై కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై స్పందించారు. "ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన, స్వతంత్ర సంస్థ. ఇది ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి నడుస్తుంది. కాబట్టి, ప్ర‌భుత్వం జోక్యం చేసుకునే ప్రసక్తే లేదు. తనకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ప్రతిరోజూ ఉదయం నిరాధార, పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వాటన్నింటికీ నేను సమాధానం చెప్పనవసరం లేదని" ఆయ‌న అన్నారు. 

బీజేపీతో ప్రజలు విసిగిపోయారు.. : మల్లికార్జున ఖర్గే

కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే శనివారం మాట్లాడుతూ, "ఈ ఐదేళ్లలో బీజేపీ ప్రభుత్వం తీరును చూసి ప్రజలు విసిగిపోయారు, ఎందుకంటే వారు అవినీతిని ప్రోత్సహించారు. బహిరంగంగానే 40 శాతం కమీషన్ తీసుకుంటున్నారని కాంట్రాక్టర్లే నిరూపించారు. ఇది చాలు, వారు ఇతరుల నుండి రక్షణ పొందాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. అందుకే అవినీతి, మౌలిక సదుపాయాల లేమి, కుల, రిజర్వుడ్ వర్గాల మధ్య విభజన - దుర్మార్గాలు చేస్తున్న బీజేపీ కాకుండా కాంగ్రెస్ వైపు ప్ర‌జ‌లు చూస్తున్నారు. ప్రజలు ఐక్యంగా ఉన్నారు.. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు" అని ఖ‌ర్గే అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios