సీఎంని అయినా సంతోషం లేదు... కార్యకర్తల ముందు కుమారస్వామి కంటతడి

karnataka cm kumaraswamy crying.. I'm not happy with congress alliance say's CM
Highlights

పార్టీ కార్యకర్తల సమావేశంలో కర్ణాటక  ముఖ్యమంత్రి కుమారస్వామి కంటతడి పెట్టారు.. రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయినా తాను మాత్రం సంతోషంగా లేనన్నారు.. బెంగళూరులో జేడీఎస్ కార్యకర్తలు కుమారస్వామికి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు

పార్టీ కార్యకర్తల సమావేశంలో కర్ణాటక  ముఖ్యమంత్రి కుమారస్వామి కంటతడి పెట్టారు.. రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయినా తాను మాత్రం సంతోషంగా లేనన్నారు.. బెంగళూరులో జేడీఎస్ కార్యకర్తలు కుమారస్వామికి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. నేను సీఎం కుర్చీలో కూర్చోవడం కేవలం జేడీఎస్ కార్యకర్తలకు మాత్రమే ఆనందాన్నిచ్చింది.. నాకు మాత్రం కాదు.. రైతుల కష్టాలు తీర్చాలన్న లక్ష్యంతో కష్టమైనా రుణమాఫీ హామీ ఇచ్చాను.. ఈ పథకానికి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి..? గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ప్రజలపై పన్నుల భారం మోపా.. సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం సవాళ్లతో కూడుకున్నదని... గరళాన్ని మింగిన పరమేశ్వరుడిలా నా పరిస్థితి మారిందని చెబుతూ ఉద్వేగానికి లోనైన కుమారస్వామి కంటతడి పెట్టారు.

పదే పదే ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ అలాగే ప్రసంగించారు. ఈ సమయంలో ఉద్వేగానికి లోనైన కార్యకర్తలు.. మీరు ఏడవకండి.. మీ వెంట మేమున్నాం అంటూ మద్ధతుగా నిలిచారు. 
 

loader