మంగళూరు పారిశ్రామిక ప్రాంతంలో కెమికల్ లీక్ అయిన ఘటనలో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇప్పుడు వారంతా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. 

కెమికల్ లీక్ (chemical leak) అయిన ఘటనలో 20 మంది ఆస్పత్రి పాలయ్యారు. ఈ ప్ర‌మాదం క‌ర్నాట‌క‌లో (karnataka) చోటు చేసుకుంది. క‌ర్నాట‌క‌లోని మంగ‌ళూరు (mangaloor) పారిశ్రామిక ప్రాంతంలోని ఓ ప్లాంట్ లో మంగ‌ళ‌వారం ఒక్క సారిగా కెమిక‌ల్ లీక్ అయ్యింది. ఈ ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో 80 మంది ఉద్యోగులు ఆ ప్లాంట్ లో ప‌ని చేస్తున్నారు. ఈ ప్ర‌మాదం వ‌ల్ల 20 మందికి అస్వ‌స్థ‌తకు గుర‌య్యారు. దీంతో వారిని హుటాహుటిన హాస్పిట‌ల్ కు తీసుకెళ్లారు. వారు ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. 

ఈ ఘ‌ట‌న విష‌యం తెలుసుకున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, అగ్నిమాప‌క సిబ్బంది, ఇత‌ర అధికారులు వెంట‌నే ప్ర‌మాద స్థ‌లానికి చేరుకున్నారు. అక్క‌డి ప‌రిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అధికారులు దీనిపై విచార‌ణ జ‌రుపుతున్నారు. ఈ ఘ‌ట‌నపై మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.