Bangalore: కర్ణాటక ఎన్నికలకు ముందు బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కుమారుడు రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. బెంగళూరులోని తన కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మదల్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మదల్ లోకాయుక్త అధికారులకు పట్టుబడ్డాడు.
Karnataka-Lokayukta: బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కుమారుడు రూ.40 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. బెంగళూరులోని తన కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మదల్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మదల్ లోకాయుక్త అధికారులకు పట్టుబడ్డాడు.
వివరాల్లోకెళ్తే.. బెంగళూరులోని తన ప్రయివేటు కార్యాలయంలో రూ.40 లక్షలు లంచం తీసుకుంటుండగా కర్ణాటక ప్రభుత్వ యాంటీ కరస్పాండెంట్ వాచ్ డాగ్ లోకాయుక్త అధికారులు ఓ సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే కుమారుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మదల్ విరూపాక్షప్ప కుమారుడు ప్రశాంత్ మదల్ తన కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులకు పట్టుబడ్డారని ఇండియా టూడే నివేదించింది. ప్రస్తుతం కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ చైర్మన్ గా మదల్ విరూపాక్షప్ప వ్యవహరిస్తున్నారు.
ప్రశాంత్ లంచం తీసుకున్నాడని ఓ వ్యక్తి గురువారం ఉదయం ఫిర్యాదు చేసినట్లు లోకాయుక్త అధికారులు తెలిపారు. మరికొంత డబ్బును సైతం తీసుకోవడానికి డిమాండ్ చేశాడని పేర్కొన్నారు. దీంతో లోకాయుక్త అధికారులు పక్కా ప్రణాళికతో ప్రశాంత్ రూ.40 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆయన కార్యాలయంలో సోదాలు నిర్వహించి రూ.1.7 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు లోకాయుక్త అధికారి ఒకరు తెలిపారు. ప్రశాంత్ తన తండ్రి తరఫున లంచాలు తీసుకుంటున్నట్లు అనుమానిస్తున్నామనీ, ఆయన కార్యాలయంలో దొరికిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నామని లోకాయుక్త అధికారులు తెలిపారు.
ఇదే విషయంపై బీజేపీ ఎమ్మెల్యే మడాల్ విరూపాక్షప్పను సంప్రదించగా.. వార్తా కథనాల ద్వారా ఈ సంఘటన గురించి తనకు తెలిసిందని చెప్పారు. ప్రస్తుతం లోకాయుక్త కస్టడీలో ఉన్నందున తన కుమారుడితో మాట్లాడలేదన్నారు. కాగా, ఇటీవల కర్ణాటక హైకోర్టు రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖను రద్దు చేసి లోకాయుక్త అధికారాలను పునరుద్ధరించింది. లోకాయుక్త అనేది ప్రభుత్వం లేదా దాని పరిపాలన (పబ్లిక్ సర్వెంట్స్) పని సమగ్రత-సామర్థ్యానికి వ్యతిరేకంగా ఫిర్యాదులను త్వరగా పరిష్కరించడానికి రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయబడిన అవినీతి నిరోధక అథారిటీ.
