బెంగుళూరు: కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప శుక్రవారం నాడు సాయంత్రం ఆరు గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు.

శుక్రవారం నాడు ఉదయం రాజ్‌భవన్ లో  యడ్యూరప్ప గవర్నర్ వాజ్‌భాయ్ వాలాను  కలిశారు.  గవర్నర్ ను కలిసిన తర్వాత యడ్యూరప్ప ఈ విషయాన్ని ప్రకటించారు.

మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ నేతృత్వంలో బీజేపీ బృందం బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, బీజేపీ తాత్కాలిక అధ్యక్షుడు జేపీ నడ్డాలను కలిసి దక్షిణ కర్ణాటక ప్రాంతంలో చోటు చేసుకొన్న పరిణామాలను వివరించారు.కర్ణాటక  అసెంబ్లీలో బీజేపీకి 105 స్థానాలు ఉన్నాయి.