కర్ణాటక ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో ముదిగెరె అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరఫున గెలిచిన ఎంపి కుమారస్వామికి ఈ సారి పార్టీ టికెట్ కేటాయించలేదు. దీంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. 

కీలకమైన కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నుంచి మరో ఎమ్మెల్యే బయటకు వచ్చారు. ఇప్పటికే పలువురు ముఖ్య నాయకులు పార్టీని వీడారు. తాజాగా ముదిగెరె ఎమ్మెల్యే ఎంపి కుమారస్వామి కూడా బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్‌కు ఆయన రాజీనామ లేఖ పంపించారు. 

హనుమాన్ జయంతి ర్యాలీలో హింసాకాండ.. మత ఘర్షణలో 10 మంది పోలీసులకు గాయాలు.. వాహనాలకు నిప్పు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటి వరకు రెండు విడతల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అందులో కుమారస్వామి పేరు లేదు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ముదిగెరె టికెట్ ను బీజేపీ ఈ సారి దీపక్ దొడ్డియాక కేటాయించింది. కుమారస్వామిపై ఫిబ్రవరిలో ఎనిమిది చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయి. పలు వివాదాల్లో కూడా ఆయన పేరు వినిపించింది. ఈ నేపథ్యంలో ఆయనకు టికెట్ కేటాయించకూడదని బీజేపీ భావించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ ఆయన అనుచరులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. 

బీజేపీకి షాక్.. రాజకీయాల నుంచి తప్పుకున్న కర్ణాటక మంత్రి.. పార్టీకి ప్రచారం కూడా చేయబోనని ప్రకటన.. ఎందుకంటే ?

కాగా.. కుమారస్వామి బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ కు పంపించిన లేఖలో.. పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల తీవ్ర మనస్తాపం చెంది తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు. అనంతరం ఓ ఫేస్ బుక్ లైవ్ లో మాట్లాడుతూ.. అభివృద్ధి విషయంలో తాను ఎప్పుడూ రాజీపడలేదని, అన్ని కులాలు, మతాల ప్రజలను సమానంగా చూడాలనే తన ఆశయాన్ని బీజేపీ హైకమాండ్ తప్పుదారి పట్టించిందని అన్నారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విధానసౌధ ఆవరణలో తాను చేసిన నిరసనను కూడా తప్పు పట్టడం ఆశ్చర్యం కలిగించే విషయమని ఆయన అన్నారు.

కాగా.. బీజేపీ 23 మంది జాబితాతో రెండో జాబితాను బుధవారం విడుదల చేసింది. హుబ్లీ ధార్వాడ్ సెంట్రల్, కృష్ణరాజ, శివమొగ్గ, మహదేవపుర తదితర నియోజకవర్గాలతో సహా 12 నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను బీజేపీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. కర్ణాటక అసెంబ్లీకి మే 10న ఒకే విడతలో ఎన్నికలు జరుగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.

దోహా ఎయిర్ పోర్టులో భారత కరెన్సీని ఉపయోగించిన సింగర్ మికా సింగ్.. ప్రధాని మోడీకి సెల్యూట్ అంటూ ట్వీట్..

హుబ్బళ్లి-ధార్వాడ సెంట్రల్ నియోజకవర్గం, మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ మరియు మాజీ మంత్రి కె.ఎస్. ఈశ్వరప్ప నియోజకవర్గం శివమొగ్గ నుంచి అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. బీజేపీ ఇంకా 12 మంది అభ్యర్థులకు టిక్కెట్లు ప్రకటించలేదు. మే 10న రాష్ట్రంలో ఓటింగ్ నిర్వహించి మే 13న ఫలితాలు వెలువడనున్నాయి. 

బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో పలువురు యువకులు ఈ సారి టికెట్ కేటాయించింది. మొత్తంగా ఈ సారి 52 మంది కొత్త అభ్యర్థులకు టికెట్ అందించింది. ఈ జాబితాలో 32 మంది ఓబీసీ సామాజిక వర్గానికి చెందినవారు కాగా, 30 మంది షెడ్యూల్డ్ కులాలకు చెందిన అభ్యర్థులు ఉన్నారు. అయితే రెండో జాబితాలో ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను పార్టీ మార్చింది. ఇందులో ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నాగరాజ చబ్బికి కల్ఘట్గి నియోజకవర్గం టికెట్ ఇచ్చారు.