బెంగళూరు: కర్ణాటకలో మూడు లోక్‌సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు శనివారం ఉదయం నుంచి ఉపఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఎంత తొందరగా ఓటు వేద్దామా అంటూ ఓటర్లు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. రామనగరం నియోజకవర్గంలోని మొట్టెదొడ్డి ప్రాంతంలో ఏర్పాటు చేసిన 179వ పోలింగ్‌ కేంద్రంలోకి అనుకోని అతిథి వచ్చారు. 

ఓటర్లు మాత్రమే వచ్చే ఆ బూత్ లోకి అనుకోని అతిథిగా వచ్చి ప్రజలను పరుగులెత్తించింది. దాన్ని చూసి ఓటర్లు అధికారులు ఎక్కడికి అక్కడ వదిలేసి పరుగులు తీశారు. ఇంతకీ ఓటర్లను అధికారులను అంతలా భయపెట్టిన ఆ అనుకోని అతిథి ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా ఇంకెవరు పాము. 

 

పాము హడావిడితో కాసేపు ఓటింగ్ ప్ర

క్రియను నిలిపివేశారు అధికారులు. దీంతో ఓటింగ్‌ ప్రక్రియ కాసేపు నిలిపివేయాల్సి వచ్చింది. అధికారులు స్నేక్స్ సొసైటీ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు కాసేపు శ్రమించి ఎట్టకేలకు పామును పట్టుకున్నారు. అక్కడి నుంచి తీసుకెళ్లడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.  

 

అయితే పోలింగ్ కేంద్రంలో పాము పెట్టిన హంగామా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దీంతో పాముకి కూడా ఓటుహక్కు వచ్చిందా అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.  రామనగరం నియోజకవర్గం నుంచి కర్ణాటక సీఎం కుమారస్వామి సతీమణి అనిత కుమారస్వామి పోటీ చేస్తున్నారు.