లక్నో: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాన్పూర్ ఎన్ కౌంటర్ లో ఎనిమిది మంది మృతి చెందారు. ఈ విషయమై వికాస్ దూబేకు స్థానిక పోలీస్ స్టేషన్ నుండి ముందుగానే సమాచారం అందిందని దర్యాప్తులో తేలింది.

గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ముఖ్య అనుచరుడు దయాశంకర్  అగ్నిహోత్రీ గాయాలపాలై పోలీసులకు చిక్కాడు. అతడిని పోలీసులు విచారించడంతో అసలు విషయం వెలుగు చూసింది.

దాదాపుగా 60 కేసుల్లో నిందితుడుగా ఉన్న రౌడీషీటర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై దూబే గ్యాంగ్ కాల్పులు జరిపి పారిపోయింది. వికాస్ గ్యాంగ్ కాల్పుల్లో 8 మంది పోలీసులు మృతి చెందారు. పోలీసుల కాల్పుల్లో వికాస్ గ్యాంగ్ కు చెందిన ముగ్గురు మరణించారు.

 అరెస్ట్ చేసేందుకు వస్తున్నట్టుగా  స్థానిక పోలీస్ స్టేషన్ నుండి దూబేకు పోలీసుల నుండే సమాచారం వచ్చింది. దీంతో దూబే అప్రమత్తమై  పోలీసులపై కాల్పులు జరిపినట్టుగా అరెస్టైన దయాశంకర్ పోలీసులకు వివరించాడు.

పోలీసులు తాను ఉన్న ప్రాంతానికి రాకుండా రోడ్డుపై జేసీబీని అడ్డుగా పెట్టాడు. దీంతో పోలీసులు వాహనాలను రోడ్డుపైనే వదిలి నడుచుకొంటూ వెళ్లారు. దీంతో పోలీసులపై దూబే గ్యాంగ్ కాల్పులు జరిపింది.ఈ ఘటన జరిగిన సమయంలో విద్యుత్తును నిలిపివేయాలని కూడ స్తానిక పోలీసుల నుండి విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం అందింది.

ఈ ఘటనపై చౌబేపూర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జీ వినయ్ తివారీపై ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ పోలీస్ స్టేషన్  పరిధిలో ఓ వ్యక్తిని వికాస్ దూబే ప్రయత్నిస్తున్నట్టుగా ఫిర్యాదు అందినా కూడ కేసు పెట్టేందుకు  వినయ్ తివారీ నిరాకరించినట్టుగా పోలీసులు గుర్తించారు.

ఈ విషయమై ఆ వ్యక్తి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో దూబేను  అరెస్ట్ చేసేందుకు పోలీసులు జరిపిన ఆపరేషన్ వికటించింది. 8 మంది పోలీసులు మరణించారు.మూడు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టినా కూడ దూబే ఆచూకీ లభ్యం కాలేదు. దూబేను పట్టించినవారికి రూ. 1 లక్ష రివార్డును పోలీసు శాఖ ప్రకటించింది.