బాలీవుడ్ నటి కంగనా రనౌత్ రాజకీయాల్లోకి రాబోతున్నట్టు హింట్ ఇచ్చారు. హిమాచల్ ప్రదేశ్ ప్రజలు స్వాగతిస్తే.. బీజేపీ టికెట్ ఇస్తే తాను హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని వివరించారు. 

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల్లోకి వస్తానని వెల్లడించారు. ప్రజలు కోరుకుంటే.. బీజేపీ టికెట్ ఇస్తే.. హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ నుంచి పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని వివరించారు.

తాను రాజకీయాల్లోకి వస్తానని కంగనా రనౌత్ హింట్ ఇచ్చారు. తాను అన్ని రకాల పోటీకి సిద్ధంగా ఉన్నానని వివరించారు. అంతేకదు, కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అని అడగ్గా తాను అన్ని రకాల పోటీకి సిద్ధంగా ఉన్నారని వివరించారు.

రాజకీయాల్లోకి చేరే ప్రణాళికలు ఉన్నాయా? అని అడగ్గా పరిస్థితులను బట్టి.. ప్రభుత్వం తనకు అవకాశం ఇవ్వాలని అనుకుంటే.. తాను అన్నింటిలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారని వివరించారు. తనకు హిమాచల్ ప్రదేశ్ ప్రజలు సేవ చేయడానికి అవకాశం ఇస్తే వారికి తాను ఎంతో కృతజ్ఞతతో ఉంటానని తెలిపారు. కాబట్టి, ఇది కచ్చితంగా ఒక అదృష్టమే అని వివరించారు.

Also Read: కంగనా రనౌత్ ఎన్నికల పోటీపై బీజేపీ ఎంపీ హేమా మాలినీ హాట్ కామెంట్.. ‘రాఖీ సావంత్ కూడా చేస్తుంది’

ప్రధాని నరేంద్ర మోడీ ఒక మహాపురుషుడు అని అన్నారు. అంతటి మహాపురుషుడైనా మోడీ తనకు బలహీన ప్రత్యర్థి ఉండటంపై బాధపడతారని తెలిపారు. ఆయనకు తెలుసు తనకు అసలు ప్రత్యర్థే లేడని, తాను అజేయుడని తెలుసు అని పేర్కొన్నారు. అదే విధంగా రాహుల్ గాంధీ మోడీ వంటి ప్రత్యర్థిని చూసి బాధపడతారని చమత్కరించారు.

కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ గురించి మాట్లాడుతూ, ఆప్ ఇచ్చే నకిలీ వాగ్దానాలకు హిమాచల్ ప్రదేశ్ ప్రజలు తమ ఓట్లను అమ్ముకోరని అన్నారు. ఎందుకంటే.. హిమాచల్ ప్రదేశ్‌ ప్రజలు సొంతంగా సౌర విద్యుత్తును కలిగి ఉన్నారని, వారు స్వయంగా కూరగాయాలను సాగు చేసుకుంటున్నారని తెలిపారు. అందుకే హిమాచల్ ప్రదేశ్‌లో ఉచితాలు, తాయిలాలు పని చేయవని పేర్కొన్నారు.