ముంబైలోని కమల బిల్డింగ్ లో శనివారం జరిగిన అగ్ని ప్రమాదం విషయంలో ఓ విచారణ కమిటీని బీఎంసీ ఏర్పాటు చేసింది. ఇందులో నలుగురు సభ్యులు ఉంటారు. ఈ కమిటీ 15 రోజుల్లో నివేదిక ఇవ్వనుంది. 

ముంబై (mumbai)లోని టార్డియో (tardio) ప్రాంతం గల కమల బిల్డింగ్ (kamala building) శనివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) స్పందించింది. నలుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీ (enquiry committee) ఏర్పాటు చేసింది. ఈ క‌మిటీ 15 రోజుల్లో త‌న నివేదిక స‌మ‌ర్పించ‌నుంది. ఈ మేర‌కు బీఎంసీ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. డిప్యూటీ మునిసిపల్ కమిషనర్ (deputy muncipal commissioner) స్థాయి అధికారి నేతృత్వంలో ఈ క‌మిటీ విచారణ జ‌రుపుతుంద‌ని, 15 రోజుల్లో ఈ క‌మిటీ బీఎంసీ క‌మిష‌న‌ర్ కు రిపోర్ట్ (report)అందిస్తుంద‌ని పేర్కొంది. 

ముంబైలోని టార్డియో ప్రాంతంలోని (Tardeo) area) గాంధీ ఆస్పత్రికి ఎదురుగా ఉన్న 20 అంతస్తుల కమల బిల్డింగ్‌లో (Kamla building) శనివారం ఉద‌యం 7 గంట‌ల ప్రాంతంలో భారీ అగ్ని ప్ర‌మాదం సంభ‌వించింది. బిల్డింగ్‌లోని 18 అంతస్తులో మంట‌లు చెల‌రేగాయి. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు మృతి చెందారు. 23 మంది గాయపడ్డారు. ఈ ఘటన సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి 13 ఫైరింజన్లు (fire engine), 7 వాటర్ జెట్టీలను (water jetty) అక్కడికి తరలించారు. ఎట్టకేలకు మంటలను అదుపులోకి తీసుకురాగలిగారు. అగ్ని ప్రమాదంతో పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగలు అలుముకున్నాయి. అయితే అగ్ని ప్రమాద తీవ్రత దృష్ట్యా దీనిని లెవల్-3 ప్రమాదంగా అధికారులు గుర్తించారు. ఈ ప్ర‌మాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. రాష్ట్ర మంత్రులు ఆదిత్య ఠాక్రే, అస్లాం షేక్‌లు విచారణను పరిశీలిస్తారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నిన్న ప్ర‌క‌టించారు. 

మంత్రి ఆదిత్య ఠాక్రే (minister adhitya takre) కమల‌ భవనం అగ్నిమాపక ప్రదేశాన్ని సందర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించేందుకు తాను ఘ‌ట‌నా స్థ‌లానికి వ‌చ్చేసిన‌ట్టు తెలిపారు. ప్ర‌మాద స్థ‌లంలో నివ‌సించే వారితో మాట్లాడాని చెప్పారు. ఈ విషాద సమయంలో పూర్తి స‌హ‌కారాలు అందిస్తాన‌ని హామీ ఇచ్చాన‌ని తెలిపారు. 

ముంబై భవనం అగ్ని ప్రమాదంలో మరణించిన వారికి ప్రధాన మంత్రి న‌రేంద్ర మోడీ (prime minister naredndra modi) సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్ర‌క‌టించారు. ‘‘ముంబైలోని టార్డియోలో భవనం అగ్నిప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు.